2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఈ బృహత్తర ప్రయాణంలో చార్టర్డ్ అకౌంటెంట్లు (సీఏలు) కేవలం భాగస్వాములుగా కాకుండా మార్గదర్శకులుగా నిలవాలని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) నిర్వహించిన ‘అర్థసమృద్ధి–2025’ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థను నిర్మించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని లోకేశ్‌ తెలిపారు. సీఏలు కేవలం ఖాతా పుస్తకాలు సరిచూసే ఆడిటర్లు మాత్రమే కాదని, బాధ్యతకు, జవాబుదారీతనానికి ప్రతిరూపాలని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి బ్రాండ్ అంబాసడర్లుగా మారి, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో నైతిక సలహాలు అందించాలని కోరారు. విశాఖపట్నంలో అకౌంటింగ్, ఆడిటింగ్ రంగంలో ఒక ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటుకు ఐసీఏఐ చొరవ చూపాలని సూచించారు. ‘ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ’ అనే నినాదంతో తాము ముందుకెళ్తున్నామని లోకేశ్‌ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. అనంతపురంలో ఆటోమోటివ్, కర్నూలులో పునరుత్పాదక ఇంధనం, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్, ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా రంగాలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. మరో ఏడాదిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తయితే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల స్వరూపం పూర్తిగా మారిపోతుందని ధీమా వ్యక్తం చేశారు.

పరిపాలనలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ఏఐ ఆధారిత పాలన ద్వారా ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్‌తో ఒప్పందం చేసుకున్నామన్నారు. ఇప్పటికే ‘మనమిత్ర’ ద్వారా 700 రకాల పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నామని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాల వల్లే గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖకు వస్తున్నాయని పేర్కొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos