ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. గతంలో తిరుమల లడ్డూపై పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇమ్మనేని రామారావు అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. పవన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని, మరోసారి మాట్లాడకుండా అడ్డుకోవాలని, అలాగే గతంలో మాట్లాడిన వీడియోలు కూడా ఇంటర్నెట్ నుంచి తొలగించాలని పిటిషనర్ కోర్టును కోరారు.

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై గతంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంతో పాటు పలు అంశాల్ని ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీటిపై అప్పట్లోనే విమర్శలు వ్యక్తమయ్యాయి. అలాగే ఇంటర్నెట్ లోనూ ఈ వ్యాఖ్యల వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీటిని వైరల్ చేశారు. అయితే ఇప్పుడు తిరుమల లడ్డూ వ్యవహారం సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు తర్వాత కాస్త శాంతించింది. కానీ వీడియోలు మాత్రం ఇంటర్నెట్ లో అలాగే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరోసారి తిరుమల లడ్డూపై మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును పిటిషనర్ ఇమ్మనేని రామారావు కోరారు. అలాగే ఇంటర్నెట్ నుంచి కూడా పవన్ వ్యాఖ్యల వీడియోలు తొలగించేలా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ రామారావు కోర్టును కోరారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos