ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఏడేళ్లవుతున్నా ఇప్పటికీ సీబీఐ దర్యాప్తు ఏమీ తేల్చలేకపోయింది. ఇంకా చెప్పాలంటే ఈ కేసులో తమ దర్యాప్తు ముగిసిందంటూ సీబీఐ నేరుగా సుప్రీంకోర్టులోనే చెప్పేసింది. ఈ నేపథ్యంలో వివేకా కుమార్తె వినతి మేరకు ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో సునీత హైదరాబాద్ సీబీఐ కోర్టును ఆశ్రయించారు.

తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ జరిపిన దర్యాప్తు సంతృప్తి కరంగా లేదని, ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమంటూ సునీతారెడ్డి కోర్టును కోరారు. ఆమె పిటిషన్ పై ఇవాళ సీబీఐ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా సునీత తరఫున వాదనలు విన్న సీబీఐ కోర్టు.. తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది. ఈ నెల 10వ తేదీన దీనిపై తీర్పు ప్రకటించాలని నిర్ణయించింది. దీంతో సీబీఐ కోర్టు ఇవ్వనున్న తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ జరిగిన విచారణలో వివేకా కుమార్తె సునీత తరఫు లాయర్ వాదన వినిపించారు. ఇందులో సునీత తన తండ్రి హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరపకపోతే అసలు దోషులు తప్పించుకునే ప్రమాదం ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. అలాగే ఈ కేసులో ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జిషీట్ కు అదనంగా అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసేలా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోరారు. అలా చేస్తేనే ఈ కేసులో ఇప్పటివరకు వెలుగు చూడని సంచలన విషయాలు బయటకు వస్తాయని సునీత లాయర్ సీబీఐ కోర్టుకు తెలిపారు. దీంతో వాదనలు ముగించిన సీబీఐ కోర్టు తీర్పును వాయిదా వేసింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos