ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకే తెలుగుదేశం పార్టీ పుట్టిందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. రాయలసీమ గర్జన రాష్ట్రమంతా మార్మోగాలని కడపలో జరుగుతున్న మహానాడు బహిరంగ సభలో సీఎం స్పష్టం చేశారు. జనసముద్రంతో కడప నిండిపోయిందని, రాష్ట్రంలో అన్ని దారులూ కడప వైపే దారి తీయటంతో నగరం దిగ్బంధమైందని చెప్పారు. దేవుని గడపలో జరిగిన తొలి మహానాడు రెస్పాన్స్ అదిరి సూపర్ హిట్ అయిందని తెలిపారు. మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటామని కడప ప్రజలు చాటారన్నారు. ఇప్పటికే 10 అసెంబ్లీ స్థానాల్లో 7 గెలిచి సత్తా చాటిన మనం 2029 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
పరిపాలన ఎలా చేయకూడదో వైఎస్సార్సీపీ పాలన ఓ కేస్ స్టడీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వైనాట్లు, గొడ్డలి పోట్లు మన రాజకీయం కాదని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేయటమే మన విధానమన్నారు. క్లైమోర్మైన్స్కే భయపడని నేను, సమస్యలకు భయపడతానా అని తెలిపారు. నా కష్టం నా కోసం కాదని, నన్ను నమ్ముకున్న జనం కోసమని చంద్రబాబు స్పష్టం చేశారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు మార్చేందుకు ఇటుక ఇటుక పేర్చుతూ ముందుకెళ్తున్నామని వెల్లడించారు. కలసి కట్టుగా ఉంటే వైఎస్సార్సీపీకి ఇక అడ్రస్ ఉండదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
దేశానికి టెర్రరిస్టులు వల్ల ఎంత ప్రమాదమో, రాష్ట్రానికి ఆర్ధిక ఉగ్రవాదుల వల్ల అంతే ప్రమాదమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్‌తో ఆర్ధిక ఉగ్రవాదుల గుండెల్లో నిద్రపోతానని హెచ్చరించారు. రాజకీయ ముసుగు వేసుకున్న ఆర్ధిక ఉగ్రవాదుల భరతం పడతామని స్పష్టం చేశారు. తాను పడుతున్న కష్టం తనను నమ్మిన ప్రజల కోసమే అని వెల్లడించారు. ఢిల్లీలో మన పరపతి పెరిగిందన్న సీఎం, కేంద్ర సాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు.
యువత భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. యువతే తన బలం, యువత మీదే తన ఆశలు అని తెలిపారు. I am with youth అంటూ చంద్రబాబు నినదించారు. గత పరిపాలనా భూతానికి పారిశ్రామికవేత్తలు వేనకడుగు వేశారన్నారు. విధ్వంస భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తామన్న హామీతో పరిశ్రమలు మళ్లీ రాష్ట్రానికి క్యూ కడుతున్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎవరు డ్రగ్స్, గంజాయి అమ్మినా, ఆడబిడ్డల్ని వేధించినా అదే వారికి చివరి రోజని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos