విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఉండదని కేంద్రం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. నిర్వహణ నిధుల కోసం ఇబ్బంది పడుతున్న స్టీల్ ప్లాంట్ కు కేంద్రం రూ. 17వేల కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అధికారి ప్రకటనను శుక్రవారం జారీచేసే అవకాశం ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని గతంలో నిర్ణయించింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో కేంద్రంలో టీడీపీ కీలకంగా మారడం... ఆ పార్టీ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోమని హామీ ఇవ్వడంతో కేంద్రం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆపరేషనల్ ఖర్చుల కోసం ప్యాకేజీ ప్రకటించి తర్వాత.. ఆ సంస్థను పూర్తి స్థాయిలో గట్టెక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలను తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కాస్త ఆలస్యంగా సోషల్ మీడియాలో తెలపడంతో విషయం అప్పుడు వెలుగులోకి వచ్చింది.
ప్లాంట్ కు ఉన్న ఆర్దిక ఇబ్బందుల దృష్ట్యా ముడి పదార్ధాలను సమకూర్చుకోవటం సమస్య గా మారుతోంది. దీంతో, ప్లాంట్ లో మూడు బ్లాస్ట్ ఫర్నేసులు ఉన్నా రెండు బ్లాస్ట్ ఫర్నేసులనే
నిర్వహిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయకుండా పలు ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్రం పరిశీలిస్తోంది. సెయిల్ లో విలీనం చేయాలన్న డిమాండ్ కొంత కాలంగా ఉంది. రుణాల నుంచి బయటపడేందుకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు చెందిన 1500 నుంచి 2000 ఎకరాల భూములను ఎన్‌ఎండీసీకి విక్రయించే ప్రతిపాదనలు, బ్యాంకు రుణాల వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. ముడిపదార్థాల కొరత కారణంగా స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి తగ్గింది. ముడిసరుకు కొరతతో స్టీల్ ప్లాంట్‌లోని రెండు ఫర్నేసులలో ఉత్పత్తి నిలిపేశారు. ఈ నేపథ్యంలో ఫర్నేసులను తిరిగి ప్రారంభించాలని కేంద్రం నిధులు కేటాయించింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజల సెంటిమెంట్ లాంటిది. అయితే అందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా వాటా లేదు. వంద శాతం రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ కు చెందినదే. అయితే ప్రభుత్వంలో .. ఎన్డీఏ ఉండటంతో టీడీపీ ఒత్తిడి కారణంగా ప్రైవేటీకరణ ఆపేయాలని కేంద్రంర నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos