గుంటూరు : ప్రతీ ఇంటిలో ఒక ఎంటర్పెన్యూర్ వుండాలనే లక్ష్యం గా పని చేస్తానని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకరరావు అన్నారు. తాడేపల్లి లోని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మైన్ ప్రభాకర్ మాట్లాడుతూ.. నాకు ఈ భాధ్యత ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.రాష్టంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యం గా పనిచేస్తామన్నారు.దేశంలో పరిశ్రమల కు దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్ ఉండేలా నా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.ప్రతీ ఇంటిలో ఒక ఎంటర్పెన్యూర్ వుండాలనే లక్ష్యం తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విజన్ కు చేరుకునేలా పనిచేస్తామన్నారు.పదవి అనేది అలంకారం కాదని,ఒక భద్యత అని అన్నారు.ఇప్పటికే  792 సంస్థలకు APIDC ద్వారా  ఇప్పటికే లోన్ సదుపాయాలు అందించామన్నారు. పరిశ్రమల ద్వారా నే నిరుద్యోగ యువతీ,యువకులకు ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందన్నారు.ప్రతీ నియోజకవర్గం లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.యువగళం పాదయాత్రలో 20 లక్షల‌ ఉద్యోగాలు యువతకు ఇస్తామన్న లోకేష్ హామీని నెరవేర్చడమే తన ముందువున్న లక్ష్యం అన్నారు.ఆర్థిక వృద్ది సాధించాలన్న,యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా రాష్ట్రంలో  పారిశ్రామిక అభివృద్ది కీలకమైదని తెలిపారు.సీయం చంద్రబాబు పై ఉన్న నమ్మకంతో రాష్ట్రం వైపు పారిశ్రామిక వేత్తలు చూస్తున్నారని స్పష్టం చేసారు.రాష్ట్రంలో ఇండస్ట్రీయల్ పార్కులు ఏర్పాటు చేసి పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos