ఏపీలో ఆటో డ్రైవర్ల పరిస్ధితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఇప్పటికే గిరాకీలు లేవని ఓవైపు బాధపడుతుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో వారి పరిస్ధితి మరింత దీనంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే తమకు పరిహారం ప్రకటించాలని కోరుతూ ఇప్పటికే పలు చోట్ల రోడ్లెక్కుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 19న ఛలో విజయవాడకు ఆటోడ్రైవర్లు పిలుపునిచ్చారు.

హైకోర్టు వద్ద ఇవాళ జరిగిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆటో వర్కర్స్ యూనియన్ సమావేశంలో ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికై సెప్టెంబర్ 19న చలో విజయవాడ చేపట్టాలని నిర్ణయించారు. సీఐటీయూ అఖిలభారత మహాసభల సందర్భంగా జనవరి 4న విశాఖపట్నంలో జరిగే కార్మిక మహా ప్రదర్శన ను జయప్రదం చేయాలని వారు కోరారు. ఆటో రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని కోరారు. పెంచిన అన్ని రకాల ఫీజులు ,పెనాల్టీలు తగ్గించాలన్నారు. వాహన ఫిట్నెస్, ఏటీఎస్ ఆటోమేటిక్ ట్రాకులు ప్రైవేటు వారికి ఇవ్వడాన్ని రద్దు చేయాలని, వాహన ఫిట్నెస్ ను ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన నేపథ్యంలో నష్టపోతున్న ఆటో డ్రైవర్ల అందరికీ వాహన మిత్ర ద్వారా 25 వేల రూపాయలు వెంటనే అందజేయాలని యూనియన్ నేతలు కోరారు. అలాగే ఆటోవాలాలకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రవాణా రంగంలో ఆటో కార్మికుల ఎదుర్కొంటున్న పై సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 19న చలో విజయవాడ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓలా , ఉబర్, రాపిడో యాప్స్ ను రద్దుచేసి ప్రభుత్వమే యాప్స్ ను నిర్వహించాలని కూడా కోరారు. వాహన మిత్ర ద్వారా సంవత్సరానికి 25 వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos