మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు 104వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్ పీవీ సేవలను స్మరించుకుంటూ తమ స్మృతులను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలతో దేశ గతిని మార్చిన మహనీయుడు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ... పీవీ నరసింహారావు సేవలను కొనియాడారు. పీవీ నరసింహారావు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొంటూ ఎక్స్ వేదికగా నివాళి అర్పించారు.
అదేవిధంగా ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పీవీ నరసింహారావు గారి 104వ జయంతి సందర్భంగా ఘననివాళి అర్పించారు. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉండగా ప్రధాని బాధ్యతలు స్వీకరించి ఆర్థిక సంస్కరణల ద్వారా దేశగతిని మార్చిన పీవీ ఎప్పటికీ స్ఫూర్తిగానే నిలుస్తారు. ఆ మహనీయుడి స్మృతికి మరొక్క మారు నివాళి అర్పిస్తున్నానని నారా లోకేశ్ నివాళులర్పించారు. తొలి తెలుగు ప్రధానిగా, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా పీవీ కీర్తి గడించారని లోకేశ్ గుర్తుచేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పీవీ దేశానికి, రాష్ట్రానికి చేసిన సేవలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos