ఏపీలో పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా ఇన్వెస్ట్ ఏపీ నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం దావోస్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. దావోస్ వేదికగా జరిగే ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో పాల్గొని పారిశ్రామికవేత్తలతో బృందం భేటీ అవుతున్నది. చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర అధికారులు ఉన్నారు. , దావోస్ లోని బెల్వేడార్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీమిట్టల్ తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఇతర బృందం సభ్యులు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా.. భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంటు ఏర్పాటును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. భావనపాడు – మూలపేట ప్రాంతం తయారీ, ఆర్అండ్ డీ, లాజిస్టిక్స్ సౌకర్యాలను నెలకొల్పడానికి పెట్రోకెమికల్స్, గ్రీన్ ఎనర్జీలో నూతన ఆవిష్కరణలకు అసమానమైన అవకాశాలు కలిగి ఉందని లక్ష్మీమిట్టల్ కు వివరించారు. ఏపీ ప్రభుత్వం తరపున అన్నివిధాల సహాయ, సహకారాలు అందిస్తామని వారు తెలిపారు.

కాగా లక్ష్మీ మిట్టల్ తో భేటీ అనంతరం మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. లక్ష్మీమిట్టల్ తో చంద్రబాబు, లోకేశ్, ఇతర బృందం సభ్యులు ఉన్న ఫొటోను షేర్ చేశారు. ‘‘భావనపాడులో పెట్రో కెమికల్ హబ్, భారత్ లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరాను. ఏపీ ప్రభుత్వం తరపున అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపాను. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన లక్ష్మీ మిట్టల్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాను. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై లక్ష్మీమిట్టల్ సానుకూలంగా స్పందించారు.’’ అంటూ నారా లోకేశ్ ట్వీట్ లో పేర్కొన్నారు.

లక్ష్మీ మిట్టల్ తో భేటీ అయిన విషయాన్ని చంద్రబాబు కూడా ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ‘‘దావోస్ లో లక్ష్మీ ఎన్. మిట్టల్, సీఈఓ ఆదిత్య మిట్టల్ తో భేటీ అయ్యాం. ఆర్సెలార్ మిట్టల్/నిప్పాన్ స్టీల్ ఇటీవల అనకాపల్లిలో 17.8 మిలియన్ టన్నుల ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్ట్ కోసం రూ.1.4లక్షల కోట్ల పెట్టుబడి పెట్టింది. ఇది అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తుందని వివరించినట్లు ముఖ్యమంత్రి ట్వీట్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ వెళ్లిన చంద్రబాబు బృందం అక్కడ పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతున్నది. దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా పారిశ్రామిక వేత్తలతో వరుసగా చంద్రబాబు, లోకేశ్ భేటీ అవుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయని చెబుతూనే.. ప్రభుత్వం అన్నివిధాల సహాయసహకారాలు అందిస్తుందని, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని వారు పారిశ్రామికవేత్తలను కోరుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos