రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. వరుసగా ఆడ పిల్లల మీద జరుగుతున్న దారుణాలకు చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. పిఠాపురంలో టీడీపీ నేతే అత్యాచారం చేస్తే బాధితురాలిని పవన్ కనీసం పరామర్శించ లేదని విమర్శించారు. బాధిత మహిళలకు తమ పార్టీ నుంచి రూ 10 లక్షల చొప్పున జగన్ ఆర్దిక సాయం ప్రకటించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.

తెనాలిలో జరిగిన దాడిలో చికిత్స పొందుతూ మరణించిన సహన కుటుంబ సభ్యులను మాజీ సీఎం జగన్ గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో పరామర్శించారు. రాష్ట్రంలో వరుసగా ఆడపిల్లల పైన జరుగుతున్న దాడుల పైన ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. ఈ దాడులకు చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. బాధిత యువతి పైన దాడి జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా.. ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. తాను వస్తున్నానని తెలిసిన తరువాత టీడీపీ నేత వచ్చి పరామర్శ చేసి వెళ్లారన్నారు. తెనాలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఇప్పటి వరకు ఈ ఘటన పైన స్పందించలేదని విమర్శించారు.

తెనాలి ఘటనలో నిందితుడు టీడీపీ కార్యకర్తగా జగన్ ఆరోపించారు. తెనాలితో పాటుగా హిందూపురం, బద్వేలు, శ్రీకాకుళం జిల్లాల్లోనూ జరిగిన ఘటనలను ప్రస్తావించారు. టీడీపీ ప్రబుద్దులే ఇలాంటి ఘటనలను పాల్పడ్దారని విమర్శించారు. పిఠాపురంలో టీడీపీ నేతే అత్యాచారానికి పాల్పడితే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ కనీసం పరామర్శించ లేదని జగన్ ఆరోపించారు. హిందూపురంలో అత్తా కోడలి పైన గ్యాంగ్ రేప్ జరిగితే నందమూరి బాలక్రిష్ణ పరామర్శించ లేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనల పైన హోం మంత్రి స్పందించటం లేదని ఆరోపించారు.

బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ముందుకు రావటం లేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ పార్టీ నుంచి బాధితులకు రూ 10 లక్షల చొప్పున ఆర్దిక సాయం అందిస్తామని జగన్ ప్రకటించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని .. నాలుగు నెలల కాలంలో 77 మంది మహిళల పైన అఘాయిత్యాలు జరిగాయని ధ్వజమెత్తారు. ఏడుగురు హత్యకు గురి కాగా, నలుగురు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలను పోలీసులు అరికట్ట లేకపోతున్నారని జగన్ మండిపడ్డారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos