ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ కేంద్రంగా కీలక నిర్ణయాలకు సిద్దమయ్యారు. విశాఖలో మెట్రో కారిడార్ తో పాటుగా ఐటీ ప్రాజెక్టులు.. సంస్థల ఏర్పాటు పైన సమీక్ష చేయనున్నారు. అదే విధంగా రుషికొండ భవనాలను చంద్రబాబు సందర్శిస్తారు. ఈ భవనాల నిర్వహణ భారం పెరుగుతున్న సమంలో వీటి వినియోగం పైన చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం విశాఖపట్నం వస్తున్న క్రమంలో జిల్లాలోని ప్రధాన శాఖలపైనే శనివారం సమీక్షించనున్నారు. జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ, రెవెన్యూ, భోగాపురం విమానాశ్రయం ప్రధాన అంశాలుగా చేర్చారు. ఇవి కాకుండా మొత్తం 40 శాఖల నుంచి సంక్షిప్త నివేదికలు కోరారు. ఐటీ, పర్యాటకం, రహదారుల నిర్మాణం, తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

రుషికొండపై మాజీ సీఎం జగన్‌ రూ.500 కోట్లతో నిర్మించిన భవనాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా పరిశీలించే అవకాశం ఉంది. అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ మెట్రో లైన్ గురించి ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రాజెక్టు గురించి నేటి సమీక్షలో అధికారులకు చంద్రబాబు సూచనలు చేయనున్నారు.

ఇక, రుషికొండ భవనాల పైన అధికారుల నుంచి చంద్రబాబు నివేదిక కోరారు. జగన్ హయాంలో నిర్మించిన ఈ భవనాల పైన రాజకీయంగా దుమారం చెలరేగింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నేతలు ఈ భవనాలను సందర్శించారు.  చంద్రబాబు ఈ పర్యటనలో భవనాల పరిశీలన.. తాజా నిర్వహణ పైన అధికారులతో చర్చించే ఛాన్స్ ఉంది. ఈ భవనాల నిర్వహణ పైన మల్లగుల్లాలు పడుతున్నారు. రుషికొండపై 9.88 ఎకరాల్లో 1,41,438 చదరపు అడుగుల్లో 7 భవనాలు నిర్మించారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వాటి నిర్వహణకు రోజువారీ ఖర్చే లక్ష రూపాయలు దాటుతుందని ఇంజినీరింగ్‌ నిపుణుల అంచనా వేస్తున్నారు. అంటే ఏడాదికి దాదాపు రూ. 4 కోట్ల వరకు అవుతుంది.

ఈ భవనాల నిర్వహణకు ప్లంబింగ్, నీటిసరఫరా, విద్యుత్, ఏసీ టెక్నీషియన్లు, ఉద్యానవన, హౌస్‌ కీపింగ్‌కు రోజుకు 100 మంది వరకు సిబ్బంది అవసరమని అధికారులు తెలుపుతున్నారు. మరో 50 మంది షిఫ్టుల్లో పనిచేయాలి. వీటిని ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగించుకోవాలా లేక ప్రయివేటు సంస్థలకు అప్పగించి.. అన్నా క్యాంటీన్లు, ఇతర సంక్షేమ పథకాలకు వాటి నుంచి వచ్చే నిధులు వినియోగించాలా అనే చర్చ జరుగుతోంది. ఈ భవనాలను ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ - ఏపీటీడీసీకి పూర్తిస్థాయిలో అప్పగించినా ఎలా నిర్వహించాలో అంతు చిక్కట్లేదు. నిర్వహించే సామర్థ్యం, నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత ఉంది. వీటిని రిసార్టులకు కేటాయించినా అక్కడి నిర్మాణాలు అందుకు తగ్గట్లు లేవు. దీంతో వచ్చే ఆదాయం కన్నా నిర్వహణ తీవ్ర భారమవుతుందని భావిస్తున్నారు. దీంతో, నేడు చంద్రబాబు ఈ భవనాల పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos