ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఈ బడ్జెట్ లో సూపర్ సిక్స్ లో రెండు కీలక పథకాలకు నిధులు కేటాయించారు. తల్లికి వందనం పథకం కోసం నిధులు ప్రతిపాదించారు. మే నెలలో ఈ పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న చంద్రబాబు ఎంత మంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద సాయం చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. పిల్లల ఖర్చుల బాధలు తగ్గించే బాధ్యత తామే తీసుకుంటామన్నారు. మే నెలలో తల్లికి వందనం ఇస్తామని ప్రకటించారు.

త్వరలోనే రైతులకు రూ.20వేలు ఆర్థిక సాయం చేస్తామని.. మత్స్యకార కుటుంబాలకు రూ.20వేల ఆర్థిక సాయం చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆర్థిక సాయం చేసే వీలుంటేనే హామీ ఇస్తామని.. లేకుంటే మాయమాటలు చెప్పనని తెలిపారు. ప్రతీ ఏటా పెన్షన్ల కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. కుటుంబ సంబంధాలు, విలువలకు మన దేశం ప్రపంచానికే ఆదర్శమని చెప్పారు. గత ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని మండిపడ్డా రు. ప్రజలు అన్నీ తెలుసుకొని కూటమి ప్రభుత్వాన్ని తీసుకువచ్చారని వ్యాఖ్యానించారు. ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటికెళ్లి పెన్షన్లు అందిస్తున్నామన్నారు. చెప్పిన ప్రతి హామీ నిలబెట్టుకునేందుకు నిత్యం కృషి చేస్తున్నా మని వివరించారు. ప్రతి సేవా సెల్‌ఫోన్ ద్వారా అందించేందుకు శ్రీకారం చుట్టామని తెలిపారు.

అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా పేదల జీవితాల్లో మార్పులు తెస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. సంపద ఎలా సృష్టించాలన్న దానిపై నిత్యం ఆలోచన చేస్తున్నామన్నారు. తాము వచ్చిన 9 నెలల్లోనే 12.9 శాతం వృద్ధి రేటు సాధించామని చెప్పారు. కేంద్రంతో కలిసి చేసే పనులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి పనులు త్వరగా పూర్తయ్యేలా కృషి చేస్తున్నామన్నారు. నాగరిక ప్రపంచంలో పారిశుద్ధ్యం చాలా అవసరమని.. మరో 2 నెలల్లో రోడ్లపై గుంతలు పూడ్చటం పూర్తవుతుందని సీఎం తెలిపారు

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos