ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2014 లో చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో హైదరాబాద్ నుంచి వచ్చిన సమయం నుంచి కృష్ణా నది ఒడ్డున ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమనేనికి చెందిన గెస్ట్‌హౌస్‌లో ఉండేవారు. ప్రతిపక్షంలోనూ.. ఇప్పుడు తిరిగి అక్కడే కొనసాగుతున్నారు. అయితే, ఇప్పుడు చంద్రబాబు నివాసం మారనుంది. అమరావతిలో స్థలం కొనుగోలు చేసిన చంద్రబాబు కుటుంబం అక్కడే ఇంటి నిర్మాణానికి సిద్దమైంది. పూర్తి చేసిన తరువాత చంద్రబాబు వెలగపూడి ఇంటిలోనే ఉండనున్నారు.

చంద్రబాబు ఇప్పటివరకు ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమేనని గెస్ట్ హౌస్ లో చంద్రబాబు ఉండటం పైన రాజకీయంగా నూ చర్చ జరిగింది. కృష్ణా నదికి వరదలు వచ్చిన సమయంలో ఆ ఇంట్లోకి నీరు వచ్చిందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు కుటుంబం అమరావతిలోని వెలగపూడిలో 25 వేల చదరపు గజాల స్థలం కొనుగోలు చేసింది. ఆ స్థలంలో గృహం, భద్రత సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్, లాన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒకే కుటుంబంలోని ముగ్గురు సభ్యుల నుంచి స్థలం కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆ స్థలంలో భూసార పరీక్షలు చేయిస్తున్నారు.

వెలగపూడిలో చంద్రబాబు కొనుగోలు చేసిన స్థలానికి నాలుగు వైపులా రోడ్లు ఉన్నాయి. అక్కడే కీలకమైన భవనాలు, గెజిటెడ్ అధికారులు, ఎన్‌జీవో నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాలు, తాత్కాలిక హైకోర్టు, విట్, గవర్నమెంట్ కాంప్లెక్స్‌కు దగ్గరలో రెండు కిలోమీటర్ల దూరంలో ఈ స్థలం ఉంది. మొత్తంగా అయిదు ఎకరాల స్థలం చంద్రబాబు కుటుంబం కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి త్వరలో రిజిస్ట్రేషన్ జరగనుంది. దీంతో, ప్రస్తుతం ఉంటున్న నివాసం ఖాళీ చేయనున్నారు. అమరావతిలోనే తాను సొంత ఇంటిని నిర్మించుకుంటానని గతంలోనే చంద్రబాబు వెల్లడించారు.

చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలోనూ కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే అక్కడ పనులు చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అమరావతిలోనూ కొత్త ఇంటి నిర్మాణం ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. చంద్రబాబుకు అమరావతిలో శాశ్వత నిర్మాణం లేదని వైసీపీ పలు మార్లు ఆరోపించింది. ఇప్పుడు రాజధానిగా అమరావతి నిర్మాణ ప్రక్రియకు పూర్తి స్థాయిలో ప్రణాళికల అమలుకు రంగం సిద్దం అవుతోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు తాను అమరావతిలోనే ఉండేలా కొత్త ఇంటి నిర్మాణానికి నిర్ణయించారు. నిర్మాణం పూర్తయితే చంద్రబాబు ఇక అమరావతి వాసి కానున్నారు. చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణం తర్వాత.. చాలా అంశాలపై వైసీపీ నేతలకు క్లారిటీ వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos