గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి లోకేష్ ఓట్లు వేశారు. వారు ఉండవల్లి లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాడేపల్లిలో నివసిస్తున్నప్పటికీ, ఆయన గ్రాడ్యుయేట్ కాకపోవడంతో ఓటు హక్కు లేదు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఓటు పులివెందులలో ఉన్నందున ఆయన ఈ ఎన్నికల్లో ఓటు వేయలేకపోయారు. 

సీఎం చంద్రబాబు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యారు, లోకేష్ కూడా  విద్యాధికుడు కాబట్టి వారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు హక్కును పొందారు. ఆయన కూడా ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా కృష్ణా జిల్లా పెనమలూరులో మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ఓటు వేశారు. గుంటూరు-కృష్ణా గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ (కూటమి) కేఎస్‌ లక్ష్మణరావు (పీడీఎఫ్‌) మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

 ఎన్నికల్లో ఓటు వేయడం మన బాధ్యత అని సీఎం చంద్రబాబు అన్నారు. ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ''ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య దేశంలో ఓటు పెద్ద ఆయుధం. అందరూ బాధ్యతతో వేయాల్సిన అవసరముంది. ఓటు వేస్తేనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం'' అని చంద్రబాబు అన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos