ప్రతి ఒక్కరూ రోజు గంటపాటు యోగా చేస్తూ ఆరోగ్యపరమైన జీవితం అలవర్చుకోవాలని, ఆ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు అందరికీ రోల్ మోడల్ గా నిలుస్తారని ఏపీ బీసీ ఈడబ్ల్యూఎస్, సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. ఎన్ని పనులు ఉన్నా సరే 70 ఏళ్ల వయసులో కూడా సీఎం చంద్రబాబు ప్రతిరోజు యోగా చేస్తారని సవిత వెల్లడించారు. యోగాతో శారీరక, మానసిక దృఢత్వం సాధిస్తామని, తద్వారా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము అని, సీఎం చంద్రబాబు విజయ రహస్యం ఇదేనని ఆమె పేర్కొన్నారు. యోగాంధ్ర 2025 మాస ఉత్సవాలలో భాగంగా పెనుగొండ లోని కియా పరిశ్రమ వద్ద నేడు ఏర్పాటు చేసిన యోగాసనాల కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన సవిత ప్రాచీన భారతదేశం అందించిన అమూల్యమైన బహుమతి యోగా అని పేర్కొన్నారు.

ఈ వయసులో కూడా చంద్రబాబు ఒక యువకుడిలా యోగాసనాలతో శారీరక మానసిక దృఢత్వం సాధిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత సమాజంలో తీవ్ర ఒత్తిడి మధ్య జీవనం సాగిస్తున్నామని పేర్కొన్న ఆమె, ఇటువంటి సమయంలోనే మానసికంగా దృఢంగా ఉండాలంటే యోగా చేయాలని అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోగలమని తెలిపారు. యోగాతో చంద్రబాబు ఈ వయసులో కూడా ఒక యువకుడిలా రాష్ట్ర అభివృద్ధి కోసం రేయింబవళ్లు కృషి చేయగలుగుతున్నారు అన్నారు. ఆరోగ్యవంతంగా, ఏకాగ్రతతో, విజనరీ తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళుతున్నారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబును అందరూ రోల్ మోడల్ గా తీసుకోవాలని సూచించారు. ఈ నెల 21వ తేదీన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖలో నిర్వహించడానికి సీఎం చంద్రబాబు అన్ని చర్యలు తీసుకున్నారని మంత్రి సవిత వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల మందితో యోగ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

విశాఖలోని ఆర్ కే బీచ్ వద్ద ఐదు లక్షల మందితో యోగా నిర్వహించబోతున్నామని, ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీఎం చంద్రబాబు పలువురు మంత్రులు అధికారులు పాల్గొనబోతున్నారని మంత్రి సవిత వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos