ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు మంగళవారం ఢిల్లీ వెళుతున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. అమరావతి పనుల పునః ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణాలకు ప్రపంచ బ్యాంకు సహా అనేక ఆర్ధిక సంస్థల నుంచి నిధులను సమీకరిస్తున్న విషయం తెలిసిందే. రెండు ప్రతిష్ఠాత్మకమైన బ్యాంకులతో పాటు హడ్కో కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీంతో అమరావతిలో అనేక నిర్మాణాలు చేపట్టేందుకు సీఆర్డీఏ ఇప్పటికే టెండర్ల ప్రక్రియను  పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో అమరావతిలో మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మోదీని అహ్వానించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి టీడీపీ ఎంపీలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. మరో పక్క ఈ రోజు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం కానుంది. అమరావతి నిర్మాణాల కోసం సీఆర్డీఏ ఆమోదించిన టెండర్లకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.

ఢిల్లీ పర్యటనలో ప్రధానితో పాటుగా కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌తోనూ చంద్రబాబు భేటీ కానున్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా అమరావతికి ప్రపంచబ్యాంకు నిధులతో పాటుగా పలు అంశాల మీద చంద్రబాబు చర్చించనున్నట్లు సమాచారం. అలాగే అమరావతిని రీలాంఛ్ చేయాలని భావిస్తున్న చంద్రబాబు.. అమరావతి పునఃప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించనుండటమే కాకుండా... రాజధానిని నిధులపైనా చర్చించనున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos