ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. ఈ నెల 16న ప్రధాని మోదీ శ్రీశైలం ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆ తరువాత జీఎస్టీ సభలో పాల్గొంటారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం షెడ్యూల్ ఖరారు చేసింది. ఇక.. ప్రధాని రాక వేళ శ్రీశైలం ఆలయం పైన మాస్టర్ ప్లాన్ తో పాటుగా కేంద్ర సాయం పైన చర్చించాలని చంద్రబాబు భావిస్తున్నారు. శ్రీశైలం ఆలయాన్ని తిరుమల తరహాలో తీర్చిదిద్దే ప్రణాళికల పైన చర్చించి.. కేంద్రం నుంచి అనుమతులు.. సహకారం కోరాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ప్రధాని మోదీ ఈ నెల 16న కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 7:50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి 10:20 గంటలకు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. హెలికాఫ్టర్‌లో సున్నిపెంటకు బయలు దేరుతారు. ఉదయం 11:10 గంటలకు రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్‌ హౌస్‌కి చేరుకోనున్నారు. 11:45 గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 1:40 గంటలకు సున్నిపెంటలో హెలిప్యాడ్‌ నుంచి నన్నూరు హెలిప్యాడ్‌కు బయలుదేరుతారు. 2:30 గంటలకు రాగమయూరి గ్రీన్‌ హిల్స్‌ వెంచర్‌కు చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం రాగమయూరి గ్రీన్ హిల్స్‌లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అనంతరం కర్నూలు ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

ఇక.. ప్రధాని పర్యటన వేళ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా సీఎం చంద్రబాబు శ్రీశైలం ఆలయం పైన చేసిన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దేవ స్థానాన్ని సమగ్రమైన మాస్టర్ ప్లాన్​తో దివ్య క్షేత్రంగా అభివృద్ది చేయాలని డిసైడ్ అయ్యారు. తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా మాస్టర్ ప్లాన్ సిద్దం చేయాలని సూచించారు. ఇక, దేవాలయ అభివృద్ధి కోసం 2 వేల హెక్టార్ల అటవీ భూమిని దేవాదాయశాఖకు కేటాయించేలా కేంద్రాన్ని కోరనున్నారు. శ్రీశైల క్షేత్రానికి జాతీయ రహదారులను సైతం అనుసంధానించేలా ప్రణాళికలు సిద్దం చస్తున్నారు. శ్రీశైలంకు వస్తున్న ప్రధానితో శ్రీశైలం ఆలయ అభివృద్ధిపై చర్చించాలని.. సహకారం కోరాలని నిర్ణయించారు. దీంతో, శ్రీశైలం ఆలయం పైన ప్రధాని ఎలాంటి హామీ ఇస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos