ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేయగా.. పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యం ఇచ్చారు. మూడో జాబితాను కూడా త్వరలోనే విడుదల చేస్తారని చెబుతున్నారు.. ఈ లిస్ట్‌కు సంబంధించి కసరత్తు దాదాపుగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా మరో కీలక పదవిని కూడా భర్తీ చేశారు. ఈ మేరకు టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు బంపరాఫర్ ఇచ్చారు. ఆయనకు ఏకంగా కేబినెట్ ర్యాంకు పదవి దక్కింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్‌ గా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ను నియమించారు. కీలక పదవితో పాటుగా కేబినెట్ ర్యాంక్ కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కావడంతో పెందుర్తి వెంకటేష్‌కు కేబినెట్ ర్యాంక్ దక్కిందనే చర్చ జరుగుతోంది. ఎన్నికల ముందు నుంచి పెందుర్తి వెంకటేష్ చంద్రబాబు కార్యక్రమాలకు సంబంధించి కోఆర్డినేటర్‌గా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు అధికారికంగా కోఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. 

పెందుర్తి వెంకటేష్ తెలుగు దేశం పార్టీలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజానగరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అభ్యర్థి చిట్టూరి రవీంద్ర పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జక్కంపూడి విజయలక్ష్మి పై  రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కంపూడి రాజా చేతిలో ఓడిపోయారు.

2019 ఎన్నికల తర్వాత వెంకటేష్ రాజానగరం నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్నారు. అయితే గత ఏడాది జనవరిలో ఆయన నియోజకవర్గ ఇంఛార్జ్ పదవికి రాజీనామా చేశారు.. పార్టీలో మాత్రం కొనసాగుతానని.. స్థానిక పరిస్థితులతో రాజీనామా చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత బొడ్డు వెంకటరమణ చౌదరిని రాజానగరం టీడీపీ ఇంఛార్జ్‌గా నియమించింది అధిష్టానం. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బొడ్డు వెంకటరమణ చౌదరికి టికెట్ దక్కలేదు.

కూటమి పొత్తులో భాగంగా జనసేన పార్టీకి సీటు కేటాయించారు. రాజానగరం నుంచి జనసేన పార్టీ తరఫున  బత్తుల బలరామకృష్ణ పోటీచేసి విజయం సాధించారు. అలాగే బొడ్డు వెంకటరమణ చౌదరికి రాజమండ్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా నామినేటెడ్ పదవి దక్కింది. ఇప్పుడు తాజాగా పెందుర్తి వెంకటేష్‌కు ఏకంగా కేబినెట్ ర్యాంక్ దక్కింది.

మొత్తానికి రాజానగరం నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కీలక నేతలకు మంచి పదవులు దక్కాయనే చర్చ జరుగుతోంది. పెందుర్తి వెంకటేష్, బొడ్డు వెంకటరమణ చౌదరి రాజానగరంలో జనసేన పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయడంతో ప్రమోషన్ దక్కిందని స్థానికంగా పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos