ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు కొత్త రికార్డు దిశగా కార్యాచరణ ఖరారు చేసారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ప్రధాని మోదీని ఇప్పటికే చంద్రబాబు విశాఖకు ఆహ్వానించారు. నేటి నుంచి నెల రోజుల పాటు యోగా దినోత్సవం కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యోగా మన వారసత్వమని.. యోగా ఇంటర్నేషనల్ డేగా గుర్తింపు రావడానికి ప్రధాని మోదీ కారణమన్నారు. యోగా మెరుగైన జీవనానికి దోహద పడుతుందని తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని ప్రజలకు చంద్రబాబు కీలక పిలుపు ఇచ్చారు.

అందరి జీవితాల్లో యోగా అనేది ఒక భాగం కావాలని, ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా అని, ఫొటోలు, ఈవెంట్‌ కోసం ఒక రోజు చేసే కార్యక్రమం కాదని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైన మార్పు తీసుకొచ్చే కార్యక్రమం యోగా అని తెలిపారు. యోగా దినోత్సవాన్ని ప్రధాని మోదీ ఒక దీక్ష , పట్టుదలతో చేస్తున్నారన్నారు. ఇవాళ బుధవారం నుంచి నెల రోజుల పాటు యోగాంధ్ర -2025 పేరుతో ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది పాల్గొనేలా కార్యాచరణ రూపొందించామని, 5 లక్షల మందితో వచ్చే నెల 21 తేదీన యోగా డే నిర్వహిస్తామని.. ఉదయం 7 నుంచి 8 గంటలకు విశాఖపట్నం రామకృష్ణ బీచ్‌లో యోగ డే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 10 లక్షల మందికి యోగా సర్టిఫికెట్ ఇస్తామన్నారు.

యోగా వల్ల మానసిక ప్రశాంత ఏర్పడుతుందని, అనేక స్వచ్ఛంద సంస్థలు యోగాను ప్రమో ట్ చేస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో నెల రోజుల పాటు యోగాంధ్ర పేరుతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని, మీడియా కూడా యోగాను ప్రమోట్ చేసేందుకు కృషి చేయాలని కోరారు. 2,500 మందిని మాస్టర్ ట్రైనర్స్‌‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కాగా, ప్రభుత్వం రాష్ట్రంలో క‌నీసం రెండు కోట్ల మంది యోగాలో ప్ర‌వేశించేలా అవ‌గాహ‌న, శిక్ష‌ణ ఇవ్వనున్నారు. నిపుణులు రూపొందించిన యోగా కామ‌న్ ప్రోటోకాల్ ప్ర‌కారం శిక్ష‌ణ‌, అభ్యాసం చేస్తారు. యోగాలో శిక్ష‌ణ పొందిన క‌నీసం 20 ల‌క్ష‌ల మందికి స‌ర్టిఫికెట్ల జారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 100 ప‌ర్యాట‌క ప్రాంతాల్లో ప్ర‌త్యేక ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ హించనున్నారు. జూన్ 21న విశాఖ ఆర్‌కే బీచ్‌లో జ‌రిగే అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వ వేడుకల్లో..ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos