ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తిన బాట పట్టారు. ఇవాళ సాయంత్రం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ప్రస్తుతం ప్రయాగరాజ్ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా దేశ రాజధానికి చేరుకుంటారు. రెండు రోజుల పాటు అక్కడే ఉంటారని సమాచారం. ఈ క్రమంలో గురువారం సచివాలయంలో జరగాల్సిన మంత్రివర్గ సమావేశం సైతం వాయిదా పడినట్లు తెలుస్తోంది.

దీనికి కారణాలు లేకపోలేదు. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరు కానుండటమే ఈ హడావుడి పర్యటనకు కారణమని తెలుస్తోంది. రేపు సాయంత్రం 4:30 గంటలకు రామ్‌లీలా మైదాన్‌లో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మంత్రులూ ప్రమాణం చేస్తారు. లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇదివరకే ఆహ్వానం అందింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలు అయినందున తెలుగుదేశం, జనసేన పార్టీల అధ్యక్షులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇందులో పాల్గొననున్నారు. బాలీవుడ్ సెలెబ్రిటీలు అక్షయ్ కుమార్, వివేక్ ఒబెరాయ్, ఎంపీ హేమామాలిని, కిరణ్ ఖేర్ దీనికి హాజరు కానున్నారు. 

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తేలట్లేదు. నేడు ముఖ్యమంత్రి పేరును బీజేపీ అధికారికంగా ప్రకటించనుంది. ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు బీజేపీ శాసనసభా పక్షం భేటీ కానుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తమ అధినాయకుడిని ఎన్నుకుంటారు. కొత్త సీఎంగా పర్వేష్ వర్మ పేరు దాదాపుగా ఖరారు కావొచ్చు. విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ, పవన్ శర్మ, ఆతిషి సూద్, రేఖా గుప్తా పేర్లు సైతం వినిపిస్తున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos