ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో చంద్రబాబు అప్రమత్తం అయ్యారు. ఏపీ పరిస్థితులను బేరీజు వేస్తున్న చంద్రబాబు.. కొత్త కార్యాచరణతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఇందు కోసం మంత్రులు.. అధికారులతో కీలక భేటీకి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వపరంగా అమలు చేయాల్సిన యాక్షన్ ప్లాన్ ను ఖరారు చేయనున్నారు. ఈ భేటీ పాలనా పరంగా - రాజకీయంగా కీలకం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం అంటే రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తోంది. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ తొమ్మది నెలల కాలంలో సాధించిన పురోగతి పైన సమీక్ష చేయనున్నారు. ఢిల్లీ ఫలితాలతో ప్రజలు ప్రభుత్వాల నుంచి ఏం కోరుకుంటున్నారనే అంశం పైన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. దీంతో.. పాలనా పరంగా తీసుకురావాల్సిన మార్పుల పైన ఫోకస్ చేసారు. అందులో భాగంగా కీలక దిశా నిర్దేశానికి సిద్దం అయ్యారు. మంత్రులతో పాటుగా అన్ని శాఖల అధికారులతో ఈ సమావేశం నిర్వహించనున్నారు.
రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కీలక సమావేశం జరగనుంది. రెండు సెషన్లుగా మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరగనుంది. మొదటి సెషన్లో ఫైళ్ల క్లియరెన్సు, వాట్సప్ గవర్నెన్స్, మిషన్ కర్మయోగి, జీఎస్డీపీలపై చర్చించనున్నారు. రెండో సెషన్లో కేంద్ర బడ్జెట్, త్వరలో ప్రవేశ పెట్టే ఏపీ బడ్జెట్, శాఖల వారీగా ప్రగతి మేనిఫెస్టో అమలు, స్వర్ణాంధ్ర 2047 పై చర్చ జరగనుంది. సెక్రటరీలు తమ శాఖలకు సంబంధించి రెండు ప్రెజెంటేషన్స్ పంపాలని సీఎంఓ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు గుర్తించి అందుకనుగుణంగా కార్యదర్శులు తమ ప్రెజెంటేషన్ 15 నిమిషాలు ఉండేలా తయారు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్దేశించారు. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అందిస్తామని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు క్షేత్ర స్థాయిలోనూ అమలు దిశగా కార్యాచరణ ఖరారు చేయనున్నారని రాజకీయ, అధికార వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos