ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి నుంచి రెండు రోజులు పాటు కుప్పం నియోజకవర్గం లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. చంద్రబాబు సోమవారం ఉదయం 11.50 గంటలకు ద్రావిడ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారుల స్వాగతం అనంతరం మధ్యాహ్నం12.00 గంటలకు ద్రావిడ యూనివర్సిటీ ఆడిటోరియం చేరుకుని స్వర్ణ కుప్పం విజన్ - 2029ను ఆవిష్కరిస్తారు. 2.25 గంటలకు కుప్పం మండలం నడిమూరు గ్రామం చేరుకుని సోలరైజేషన్‌ను ప్రారంభించి లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు సీగలపల్లి గ్రామం చేరుకుని ప్రకృతి వ్యవసాయ రైతులతో ముచ్చటిస్తారు. ఈ సందర్బంగా ప్రకృతి వ్యవసాయం విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరిస్తారు. ఎన్‌ఓసిఎల్‌తో ఎంవోయూ కుదుర్చుకునే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. 5.55 గంటలకు ద్రవిడ యూనివర్సిటీ ఆడిటోరియం చేరుకుని పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 8 గంటలకు కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహం చేరుకుని బస చేస్తారు.

అదేవిధంగా 7వ తేదీ మంగళవారం ఉదయం 10. గంటలకు సీఎం చంద్రబాబు కుప్పం ఆర్ అండ్ బీ అతిథి గృహం నుండి బయలుదేరి కుప్పం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ చేరుకుని జననాయకుడు సెంటర్ ప్రారంభించి. ప్రజల నుండి వినతులు స్వీకరణ కార్యక్రమం చేపడతారు. మధ్యాహ్నం12.20 గంటలకు కంగుంది గ్రామం చేరుకుని దివంగత శ్యామన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. 1.20 గంటలకు కుప్పంలోని ఎన్‌టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు వెళతారు. తర్వాత మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5.05 గంటలకు శాంతిపురం మండలం కడపల్లి వద్ద నిర్మిస్తున్న సొంత ఇల్లు నిర్మాణాన్ని పరిశీలిస్తారు. 6.10 గంటలకు ద్రవిడ యూనివర్సిటీ చేరుకుని అకాడమిక్ బిల్డింగ్‌లోని కెరీర్ రెడీనెస్ సెంటర్ ను ప్రారంభిస్తారు. అనంతరం ద్రవిడ యూనివర్సిటీలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి రాత్రి 7.45 గంటలకు ఆర్‌అండ్‌బి అతిథి గృహం చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు కుప్పం నుంచి బయలుదేరి విజయవాడకు వెళతారు.

సొంత నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చే చంద్రబాబు ఈ పర్యటన ద్వారా నియోజకవర్గ ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం అవ్వడం, వారి సమస్యలను తెలుసుకోవడం, వాటికి పరిష్కారం చూపడం లక్ష్యంగా పెట్టుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటన నియోజకవర్గంలో పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos