టీడీపీ యువనేత నారా లోకేశ్ రాజకీయ ఉజ్వల భవిష్యత్తుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కా ప్రణాళిక రచించి... ఆ ప్రణాళిక అమలుకు నెమ్మదిగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీని కుటుంబ సమేతంగా లోకేశ్ కలిసే విధంగా చంద్రబాబు ప్లాన్ రూపొందించి.. సక్సెస్ చేయగలిగారు. ప్రధాని మోదీయే ఢిల్లీకి రమ్మనమని లోకేశ్ ను ఆహ్వానించారని ప్రచారం జరుగుతున్నా, ప్రధానితో భేటీ వెనుక చాలా పెద్ద కారణమే ఉందంటూ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. 

నారా లోకేష్ ఇప్పుడు అన్ని విషయాల్లోనూ పరిపక్వత సాధించిన లీడర్ గా కనిపిస్తున్నారు. మానవ వనరులు, ఐటీ మంత్రిగా ఉన్న నారా లోకేశ్ ప్రభుత్వంలో పూర్తి పట్టు సాధించినట్లేనని చెబుతున్నారు. పార్టీకి భావినేతగా అందరి ఆమోదం పొందినట్లేనని, ప్రస్తుతం టీడీపీలో ఏం జరగాలన్నా, నారా లోకేశ్ అనుమతి ఉండాల్సిందేనని చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లోనూ లోకేశ్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ... తాను రాజకీయంగా, ప్రభుత్వపరంగా వేగం తగ్గించుకుని లోకేశ్  ఫోకస్ అయ్యేలా  ఆయనతో పరుగులు పెట్టించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. 
 
ప్రభుత్వపరంగా రాష్ట్రానికి లోకేష్ ఫేస్ ను ఫేమస్ చేయడమే కాకుండా పార్టీ పరంగా, రాజకీయంగా కూడా ఆయన్ను  పాపులర్ అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు. పార్టీ పరంగా స్వతంత్రంగా రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం, ఇతర పార్టీలతో స్నేహ సంబంధాలు కొనసాగించడం వంటివి పూర్తిగా లోకేశ్ కే అప్పగించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీ, జనసేనతో సమన్వయం విషయంలోకానీ, కేంద్రంలో బీజేపీ పెద్దలతో కానీ లోకేష్ స్వతంత్రంగా మంత్రాంగం నడుపుతున్నట్లు ఇటీవల పరిణామాలు తెలియజేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

సాధారణంగా ముఖ్యమంత్రి మాత్రమే ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు, ప్రధానితో భేటీ అవుతుంటారు. ఏదైనా రాష్ట్ర మంత్రి ఢిల్లీ పర్యటనకు వెళితే తమ శాఖ పరిధిలోని అధికారిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితమవుతారు. కానీ, రాష్ట్ర మంత్రి హోదాలో ఢిల్లీకి వెళ్లి వస్తున్న లోకేశ్ ఏపీ ప్రభుత్వం తరఫున కేంద్రంలో అన్ని శాఖల మంత్రులతోనూ సమావేశమవుతున్నారు. తన రాష్ట్రానికి నిధులు సేకరణతోపాటు ప్రాజెక్టులకు అనుమతి సాధించేలా అడుగులు వేస్తున్నారు. ఇది అధికారిక పనే అయినప్పటికీ అంతర్లీనంగా ఆయా నేతలతో బంధాలు గట్టి చేసుకోవడమనే ప్రధాన టాస్క్ ఉందని అంటున్నారు. కేంద్రంలోని ప్రముఖ నేతల నుంచి రాజకీయ ఎత్తులు నేర్చుకోవాలన్న చంద్రబాబు సూచనలతో లోకేశ్.. వారితో పరిచయాలు పెంచుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇవి ఇప్పటికిప్పుడు అవసరమవకపోయినా, భవిష్యత్తులో మేలు చేస్తాయంటున్నారు. మొత్తానికి సమీప భవిష్యత్తులో లోకేశ్ కు పెద్ద బాధ్యతలు అప్పగించడానికి ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు లైన్ క్లియర్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos