ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లికి వందనం పథకం అమలు పైన స్పష్టత ఇచ్చారు. తణుకు పర్యటనలో భాగంగా చంద్రబాబు స్థానికులతో ముఖాముఖి నిర్వహించారు. ఆ సమయంలో తల్లికి వందనం అమలు పైన ప్రకటన చేసారు. వచ్చే విద్యా సంవత్సరానికి ముందే మే నెలలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. ఈ మేరకు బడ్జెట్ లో తల్లికి వందనం పథకం అమలు కోసం నిధులు కేటాయించారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే తల్లికి వందన పథకం కింద బడి కి వెళ్లే ప్రతీ విద్యార్ధి తల్లి ఖాతాలో రూ 15 వేలు చొప్పున జమ చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తరువాత ఈ ఏడాది బడ్జెట్ లో ఈ పథకం అమలు కోసం కేటాయింపులు చేసారు. మే నెలలో అమలు చేసేలా మార్గదర్శకాల పై కసరత్తు జరుగుతోంది.

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మే నెలలో ఈ పథకం కింద తల్లుల ఖాతా ల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకం అమలు పైన మరోసారి స్పష్టత ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ప్రతీ తల్లి ఖాతాల్లో ఈ పథకం కింద నిధులు జమ చేస్తామని ప్రకటించారు. హామీ ఇచ్చిన విధంగా ప్రతీ ఇంటా చదువుకునే ప్రతీ ఒక్కరికి ఈ పథకం అమలు అవుతుందని వెల్లడించారు. ఇప్పటికే అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు.. మంత్రి లోకేష్ ఈ పథకాల అమలు పైన స్పష్టత ఇచ్చారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ త్వరలో ఇస్తామని చెప్పారు. బడ్జెట్‌లో రూ.9407 కోట్లు ఈ పథకానికి కేటాయించామని చెప్పారు. గత ప్రభుత్వం సంవత్సరానికి రూ.5,540 కోట్లు కేటాయించారని.. గతంతో పోలిస్తే ఇది 50 శాతం అధికమని చెప్పుకొచ్చారు.

ఇంటిలో ఎంత మంది చదువుకునే బిడ్డలు ఉంటే అంతమందికి పథకాన్ని వర్తింపజేస్తామని ప్రభుత్వం స్పస్టం చేస్తోంది. వైసీపీ మాత్రం రాష్ట్రంలో బడికి వెళ్తున్న పిల్లల సంఖ్య 82 లక్షలుగా ఉందని.. ఇందు కోసం రూ 13 వేల కోట్లకు పైగా అవసరం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం దీని పైన స్పష్టత ఇచ్చింది. అర్హతల విషయంలో గతంలో 75 శాతం హాజరు తప్పని సరి చేసారు. ప్రస్తుత ప్రభుత్వం సైతం ఈ నిబంధన కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. పథకం అమలు కోసం అధికార యంత్రాంగం మార్గదర్శకాల పైన కసరత్తు చేస్తోంది. త్వరలోనే వీటిని అధికారికంగా ఖరారు చేయనున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos