ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీలో కొందరు ముఖ్య నేతలకు సాయిరెడ్డి టెన్షన్ మొదలైంది. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అక్రమాల పైన కూటమి ప్రభుత్వం విచారణ సాగిస్తున్న వేళ సాయిరెడ్డి కీలక వ్యక్తుల పేర్లు ప్రస్తావించి.. వారికి ఉచ్చు బిగించారు. కూటమికి ఈ పరిణామాలు వరంగా మారుతున్నాయి. దీంతో, జగన్ అలర్ట్ అయి.. ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఇటీవల కాకినాడ పోర్టు గురించి సీఐడీ విచారణకు హాజరైన సాయిరెడ్డి రెండు ప్రధాన అంశాల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. పోర్టు వ్యవహారంలో అంతా సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి కర్మ, కర్త, క్రియగా పేర్కొన్నారు. పరోక్షంగా విక్రాంత్ రెడ్డి మొత్తం వ్యవహారం నడిపారనే అభియోగాల వేళ సాయిరెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అదే సమయంలో లిక్కర్ స్కాంలోనూ ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లిక్కర్ స్కాంలో సూత్రధారి .. పాత్రధారిగా పేర్కొన్న సాయిరెడ్డి.. భవిష్యత్ లో అవసరమైతే మరిన్ని అంశాలను వెల్లడిస్తానంటూ పార్టీ నేతలకు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. లిక్కర్ వ్యవహారంలో ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి లక్ష్యంగా టీడీపీ తమ సోషల్ మీడియా ఖాతాలో సంచలన ఆరోపణలు చేసింది. మిథున్ రెడ్డి సైతం తమ పైన రాజకీయ కోణంలోనే ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇటు లిక్కర్ స్కాంలో వైసీపీ ముఖ్య నేతలకు ఉచ్చు బిగుస్తోందనే చర్చ కూటమి ముఖ్య నేతల్లో జరుగుతోంది. త్వరలోనే నోటీసులు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. సాయిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలను విచారణలో పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇక, సాయిరెడ్డి తాజాగా పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి మరో ట్వీట్ చేస్తూ .. కోటలో రాజు ప్రజల్లోకి రావాలని సూచించారు. కోటరీ మాటలు వింటే కోట కూలిపోతుందని.. రాజ్యం పోతుందని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. సీఎంగా ఉన్న సమయంలో జగన్ ప్రజలను కలవని అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఇప్పటికైనా ఇక ప్రజల్లోకి రావాలనే విషయాన్ని జగన్ కు సూచించారు. ఇటు జగన్ పార్టీ నియామకాలు పూర్తి చేయాలని నిర్ణయించారు. సాయిరెడ్డి వ్యాఖ్యల పైన పార్టీ నేతలు స్పందిస్తున్నారు. జగన్ తాజాగా సాయిరెడ్డి వ్యాఖ్యల గురించి ముఖ్య నేతలు ప్రస్తావన చేసినా.. స్పందించలేదని తెలుస్తోంది. ఇక.. వచ్చే నెల నుంచే జిల్లా పర్యటనలు చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కాగా, పోర్టు వివాదం .. లిక్కర్ స్కాంలో ఇప్పుడు సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో.. ఈ కేసుల్లో తదుపరి విచారణలో సాయిరెడ్డి పాత్ర ఉంటుందా.. ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ పార్టీలో కనిపిస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos