అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇండో-యూఎస్‌ భాగస్వామ్యం గణనీయంగా బలోపేతమైంది. ప్రధాని మోదీ, ట్రంప్‌ నాయకత్వంలో రెండు దేశాల సంబంధాలు మరింత బలపడాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ పగ్గాలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం 79 ఏళ్ల వయసున్న ట్రంప్‌.. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టడం ఇది రెండోసారి. 2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ గెలిచారు. ఇప్పుడు కూడా డెమోక్రటిక్‌ పార్టీ మహిళా అభ్యర్ధి కమలహారిస్‌ పై గెలుపొందారు.

అమెరికాలో అధ్యక్షుడి పదవి కాలం నాలుగేళ్లు ఉంటుది. ఎవరైనా రెండు సార్లు మాత్రమే పదవి చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ట్రంప్‌కు మరోసారి పోటీ చేసే అవకాశం లేదు. అమెరికాకు గతంలో యువ అధ్యక్షులు వచ్చేవారు. కానీ ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్… కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరూ 80కి దగ్గర పడిన వారే. ఆనారోగ్య సమస్యలతో ఉన్నవారే.

ఇక ట్రంప్ తో పాటు ఉపాధ్యక్షుడిగా పోటీ పడిన జేడీ వాన్స్ తెలుగు వారికి అల్లుడు. ఆయన భార్య ఉషా చిలుకూరి ఆంధ్ర మూలాలున్న మహిళ. మొత్తంగా అమెరికాలో మరో సారి ట్రంప్ హవా ప్రారంభమయింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos