ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీ టూర్ కు సిద్దమవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలుమార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ప్రధాని మోడీతో పాటు ఇతర కేంద్రమంత్రుల్ని తరచుగా కలుస్తున్నారు. అలాగే ఈ చర్చల్లో రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్లను నెరవేర్చుకున్నారు కూడా. దీంతో చంద్రబాబు ఈసారి ఢిల్లీ టూర్ పైనా చర్చ జరుగుతోంది. ఈసారి ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు రెండు, మూడు కీలక అంశాలపై ప్రతిపాదనలు పెట్టడంతో పాటు పెండింగ్ లోని అంశాలపై కూడా చర్చిస్తారని అంటున్నారు.

ఈ నెల 7న సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈసారి ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. అలాగే రైల్వే మంత్రి అమిత్ షా, జల్ శక్తి మంత్రితోనూ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ టూర్ లో అమరావతి రాజధానికి ప్రపంచ బ్యాంక్ నిధులపై చర్చిస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రాజధానికి కేంద్రం గ్యారంటీతో రూ.15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు ప్రధాని మోడీ, అమిత్ షాతో చర్చించే అవకాశాలున్నాయి.

అలాగే విశాఖ రైల్వే జోన్ శంఖుస్థాపన ముహుర్తంపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో చంద్రబాబు చర్చిస్తారు. దీంతో పాటు రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపైనా చర్చలు జరపబోతున్నారు. వీటిలో అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధులు, రైల్వే జోన్ శంఖుస్థాపన ఖాయంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి చంద్రబాబు ప్రధాన అంశాలపై చర్చించి వాటిని సాధించుకుని వస్తారని టీడీపీ నేతలు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos