ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు నారా దేవాంశ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు సీఎం చంద్రబాబుకు ఆలయ మహాద్వారం వద్ద తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, అర్చకులు లాంఛనంగా స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సీఎం చంద్రబాబు ఆయన కుటుంబీకులు యథావిధిగానే వీఐపీల కోసం కేటాయించిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి దర్శనానికి శుక్రవారం ఉదయం 8.10 గంటలకు ఆలయంలోకి వెళ్లారు.సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మహద్వారం నుంచి కాకుండా, క్యూకాంప్లెక్స్ నుంచి మాత్రమే వెళ్లడానికి ఆసక్తి చూపిస్తారనే మాటను మరోసారి నిరూపించారు. శ్రీవారి దర్శనం తరువాత సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబీకులకు రంగనాయకులు మండపంలో వేదపండితులు వేదాశీర్వదం అందించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈఓ శ్యామలరావు వారికి శ్రీవారి ప్రసాదాలు అందించడంతో పాటు శేషవస్త్రాన్ని బహూకరించారు. ఉదయం 9.28 గంటలకు శ్రీవారి దర్శననం అనంతరం సీఎం చంద్రబాబు కుటుంబం ఆలయం నుంచి వెలుపలికి వచ్చింది.
అనంతరం తరిగొండ వెంగమాంబ సత్రంలో దేవాన్ష్ పేరుతో అన్నదానం నిర్వహించారు. చంద్రబాబు, కుటుంబ సభ్యులు ప్రసాదాలు వడ్డించారు. మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు మొక్కును చంద్రబాబు చెల్లించారు. దీనికోసం టీటీడీకి రూ. 44 లక్షలు విరాళంగా అందించారు. అన్నదాన సత్రంలో యాత్రికులకు ఒకరోజు అన్నప్రసాదాలు వడ్డించడానికి ఒక రోజుకు 44 లక్షలు ఖర్చు అవుతుంది. తన మనవడు పుట్టిన రోజు సందర్బంగా సీఎ చంద్రబాబు ఆ మొత్తం విరాళంగా టీటీడీకి అందించారు. ఈ మేరకు టీటీడీ అన్నదానసత్రంలో దేవాన్ష్ పేరును ప్రకటించారు. మధ్యాహ్నం తిరుమల నుంచి బయలుదేరి చంద్రబాబు హైదరాబాద్ చేరుకుంటారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos