ఏపీ రాజధాని అమరావతికి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం, ప్రపంచ బ్యాంకు అండతో అమరావతి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరుగులు పెట్టించే పనిలో ఉన్నారు. ఇప్పటికే అమరావతి రాజధానిలో పనుల్ని జనవరి నుంచి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదే క్రమంలో ఇవాళ మరో రూ.2723 కోట్ల మేర పనులకు సీఆర్డీయే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఆర్డీయే 44వ సమావేశంలో ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ఇవాళ ఏపీ సచివాలయంలో జరిగిన సీఆర్డీఏ అథారిటీ భేటీలో సీఎం చంద్రబాబుతో మున్సిపల్ మంత్రి నారాయణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణాల చెల్లింపునకు ఇబ్బంది లేకుండా 102 కోట్లు చెల్లించాలని నిర్ణయించారు. వచ్చే జూన్ 12 నాటికి లక్షా 18 వేల ఇళ్లు పూర్తి చేసి ప్రారంభించనున్నారు. అలాగే అమరావతిలో మొత్తం రూ. 2723 కోట్ల పనులకు ఆమోదం తెలిపారు. రాజధాని రింగ్ రోడ్డు, విజయవాడ బైపాస్ రోడ్డు ప్రాజెక్టుపై కూడా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. మరోవైపు, ఇప్పటి వరకు రూ. 47,288 కోట్ల విలువైన పనులకు సీఆర్డీయే ఆమోదం తెలిపింది.
ఈ సందర్బంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతిపై ఇప్పటికీ వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి కోసం తీసుకున్న భూములను అమ్మడం ద్వారా లోన్ లు కడతామని, అమరావతిలో వచ్చే ఆదాయంతో నే తిరిగి రుణాలు చెల్లిస్తామన్నారు. ప్రజలపై ఎలాంటి భారం లేకుండా ఈ రుణాలు తీరుస్తామని, పోర్టులు,మానుఫాక్చర్,ఎలక్ట్రానిక్, ఐటీ పరిశ్రమలతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎవరెంత దుష్ప్రచారం చేసినా మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos