గత వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త, వివాదాస్పద భూ విధానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల భూములను కాజేసేందుకే ప్రమాదకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకొచ్చారని, అందుకే తాను అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని రద్దు చేస్తూ రెండో సంతకం పెట్టానని స్పష్టం చేశారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరంలో 'మీ భూమి - మీ హక్కు' కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కొందరు రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్పుస్తకాలను పంపిణీ చేసి, వాటిపై ఉన్న క్యూఆర్ కోడ్, సాంకేతికతను స్వయంగా పరిశీలించారు.

అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక నుంచి ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. "మన పూర్వీకులు కష్టపడి సంపాదించిన, మన స్వార్జితమైన భూమిపై  జగన్ ఫొటో ఏమిటి.. సరిహద్దు రాళ్లపై ఆయన ముద్రలు వేయడమేంటని గతంలోనే ప్రశ్నించాను. ఇది అహంకారానికి నిదర్శనమని" చంద్రబాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకపోయుంటే, ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో ప్రజల భూములన్నీ వారికి నచ్చిన వారికి కట్టబెట్టేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. "నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు చాలా ప్రమాదకరమైన ఆలోచన చేశారు. మీ భూముల వివరాలన్నీ వారి అనుచరులు అమెరికాలో పెట్టుకున్నారు. ప్రజలు సరైన సమయంలో బ్యాలెట్ ద్వారా తగిన బుద్ధి చెప్పారని"   చంద్రబాబు అన్నారు. భూమి అంటే రైతుకు కేవలం ఆస్తి కాదని, అదొక విశ్వాసం, కుటుంబంతో పెనవేసుకుపోయిన సెంటిమెంట్ అని చంద్రబాబు పేర్కొన్నారు. కరోనా సమయంలో అందరూ సెలవులు తీసుకున్నా, దేశానికి అన్నం పెట్టే రైతుకు మాత్రం సెలవు లేదని గుర్తుచేశారు. 

గత పాలకుల తీరు వల్ల తాను ఎక్కడికి వెళ్లినా భూ వివాదాలకు సంబంధించిన పిటిషన్లే ఎక్కువగా వస్తున్నాయని, వాటన్నింటినీ పరిష్కరించాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని సీఎం చంద్రబాబు తెలిపారు. స్వర్గీయ ఎన్టీఆర్ కరణం, మునసబు వ్యవస్థను రద్దు చేసి రైతులకు మేలు చేస్తే, తెలంగాణలో పండుగ చేసుకున్నారని, కానీ మన రాష్ట్రంలో కొందరు దానిని వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఇకపై భూ వివాదాలకు తావులేకుండా పూర్తి పారదర్శకతతో రికార్డులను పక్కాగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. "తహసీల్దారు కార్యాలయంలో కాదు, గ్రామసభలు నిర్వహించి, ప్రజల మధ్యనే పాస్‌పుస్తకాలు పంపిణీ చేయాలని ఆదేశించాను. పద్ధతి ప్రకారం రీసర్వే చేయించి, రికార్డులను ట్యాంపర్ చేయడం అసాధ్యమయ్యేలా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని వినియోగిస్తున్నాం  పాస్‌బుక్‌పై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు, మీ భూమి వివరాలన్నీ క్షణాల్లో కనిపిస్తాయని" వివరించారు. 

ఈ రాజముద్రతో కూడిన పాస్‌పుస్తకాలను రైతులకు, భూ యజమానులకు సత్వరమే అందించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos