నారావారిపల్లె :- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్, నందమూరి రామకృష్ణ, ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర, బాలకృష్ణ చిన్నల్లుడు ఎంపీ శ్రీభరత్, చిన్నకుమార్తె తేజస్వినితో పాటు పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గ్రామానికి చెందిన చిన్నారులు, మహిళలకు ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. చిన్నారులకు బెలూన్ బ్లాస్టింగ్ (కాలికి బెలూన్ కట్టి తొక్కడం), గేమ్‌ గన్నీబ్యాగ్స్ (గోనె సంచుల్లో నిల్చుని పరిగెత్తడం) వంటి ఆటల పోటీలను సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్‌బాబు ప్రారంభించి తాను కూడా పాల్గొన్నారు. చిన్నారులు ఆటలు ఆడుతున్న సమయంలో సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులు ఆసక్తిగా తిలకించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారిని సీఎం అభినందించారు. అందరినీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని వారి పేరు, ఏం చదువుతున్నారు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లలందరికీ బ్యాగులను బహుమతిగా అందించారు. మహిళలకు భువనేశ్వరి, బ్రాహ్మణి ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతితో పాటు పాల్గొన్నవారందరికీ బహుమతులు అందించారు. అనంతరం పలువురు బాధితులు, దివ్యాంగులు, వృద్ధులు తమ సమస్యలపై సీఎంకు అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే పులివర్తి నాని, నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos