సీఎం చంద్రబాబు నాయుడు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా నేడు పలువురు మంత్రులతో వరుసగా సమావేశం అవుతున్నారు. కేంద్ర పునరుత్పాదక ఇంధనశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఏపీకి సహకారం కోరారు. సమావేశం అనంతరం చర్చలు ఫలవంతంగా సాగాయని చంద్రబాబు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఆంధ్రప్రదేశ్‌కు రూఫ్‌టాప్ సోలార్ సామర్థ్యం కేటాయింపు కోసం కేంద్ర ఇంధన మంత్రి ప్రహ్లాద్ జోషితో ఫలవంతమైన సమావేశం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. 20 లక్షల ఎస్సీ, ఎస్టీ గృహాలకు ఉచిత రూఫ్‌టాప్ సోలార్, బీసీ వినియోగదారులకు సబ్సిడీ యాక్సెస్, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10,000 రూఫ్‌టాప్ యూనిట్లను సాధించడం తమ లక్ష్యంగా స్పష్టం చేశారు.
కేంద్రం మద్దతుతో, ఇంధన ఖర్చులను తగ్గిస్తామన్నారు. ప్రజలను శక్తివంతం చేస్తూ భారతదేశ క్లీన్ ఎనర్జీ పరివర్తనకు నాయకత్వం వహిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అనంతంరం రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ను కలిశారు. ఏపీలో వ్యూహాత్మక రక్షణ, ఏరోస్పేస్ ప్రాజెక్టులపై సీఎం చర్చించారు. బీఈఎల్ డిఫెన్స్ కాంప్లెక్స్, హెచ్‌ఏఎల్- ఏఎంసీఏ పైనా చర్చించినట్లు తెలుస్తోంది. తరువాత కేంద్రమంత్రి సి.ఆర్. పాటిల్‌ను కలిసి, రాష్ట్రానికి సాయాన్ని కోరారు. ఇవాళ రాత్రి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా శనివారం నీతిఆయోగ్ పాలకమండలి భేటీలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos