మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం డ్యామ్ నిండిపోయింది. ఈ క్రమంలో డ్యామ్ ను పరిశీలించిన సీఎం చంద్రబాబు గేట్లను ఎత్తారు. 4 గేట్లు ఎత్తి నీటిని నాగార్జున సాగర్ జలాశయానికి విడుదల చేశారు. శ్రీశైలంలో పర్యటించిన సీఎం చంద్రబాబు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి అనంతరం గేట్లు విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం డ్యామ్ కు భారీగా వరద ప్రవాహం చేరింది. ఈ సారి త్వరగా డ్యామ్ నిండినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంది.
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన సీఎం చంద్రబాబు.. అనంతరం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నీటిని సాగర్ కు విడుదల చేశారు. 6, 7, 8, 11 నంబర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ సారి జూన్ లోనే వరద ప్రారంభం అయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరద వస్తున్నట్లు అధికారులు తెలిపారు. జులై మొదటి వారానికే దాదాపు శ్రీశైలం డ్యామ్ నిండిపోయింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తాలని నిర్ణయించారు. ప్రాజెక్టు నీటి మట్టం 590 అడుగులు. అయితే నీటి నిల్వ ప్రస్తుతం 528.80 అడుగులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం డ్యామ్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 165.81టీఎంసీలకు నీరు చేరినట్లు సమాచారం. ఈ ఏడాది జూన్ నుంచే వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో సాగర్ ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ ఎడమ కాల్వకు తాగునీటి అవసరాల కోసం నీటి విడుదలను కొనసాగిస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos