పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు అమరావతిలో భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలోని తుళ్లూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని నేడు చంద్రబాబు ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు పివీఎన్ మాధవ్ తో సహా, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించారు. అమరజీవి త్యాగ శిల్పం పేరుతో రూపొందించిన ఈ విగ్రహాన్ని, అమరావతి ప్రాంతంలోని శాఖమూరు పార్కులో మొత్తం 6.80 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ నిర్మాణానికి సుమారు 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్ ను ఉపయోగించారు. కేవలం ఆరు నెలల కాలంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు. ఈ ప్రాజెక్టుకు తొలిదశ పనులను పూర్తి చేసి శిల్పాన్ని ఆవిష్కరణ గావించారు. ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటుచేసిన తొలి భారీ శిల్పంగా ఈ విగ్రహం ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది.

ఈ ప్రాజెక్టు రెండవ దశలో మ్యూజియం, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నిర్మించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుని చారిత్రక స్మారకంగా ఈ విగ్రహం నిలవనుంది. అమరావతి కేంద్రంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు నాడు ఆంద్ర రాష్ట్రం కోసం కృషి చేసిన మహనీయుడికి సరైన గుర్తింపును ఇచ్చారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos