ఏపీలో క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ పాలు కారణంగా ఐదుగురు మరణించారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాలలో డయోరిగా కారణంగా ఇద్దరు మరణించగా, పదుల సంఖ్యలో ఆస్పత్రి పాలయ్యారు. ఈ రెండు సంఘటనలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో అధికారుల పనితీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  శ్రీకాకుళం ఘటనకు సంబంధించి  శ్రీకాకుళం మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్‌ను ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. అలాగే మంతృల బృందాన్ని జిల్లాకు పంపించింది.  ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. అయితే  ఈ ఘటనలకు సంబంధించి సీఎం చంద్ర‌బాబు ఆయా జిల్లాల అధికారుల‌ను క్షేత్ర‌స్థాయిలో పర్యటించి ప‌రిశీలించాల‌న్న ఆదేశాలకు పెద్దగా స్పందించలేదు. అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలు నామమాత్రంగా  ఉండటంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెండు జిల్లాల పరిస్థితిపై నిన్న గురువారం రాత్రి సమీక్ష నిర్వహించిన చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించకుంటే తానే రంగంలోకి దిగుతానని తేల్చి చెప్పారు. పని తీరును మెరుగుపరుచుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos