ఏపీలోని తూర్పు గోదావరిజిల్లా నల్లజర్లలో ఇవాళ బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. నల్లజర్ల గ్రామంలో నిర్వహించనున్న రైతన్నా మీకోసం కార్యక్రమంలో పాల్గొననున్నారు. నవంబర్ 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభమయింది. రైతులకోసం రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న పనుల గురించి వివరించనున్నారు. రైతును రాజును చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేయనున్నారు. అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. అలాగే ఎప్పుడూ ఒకేరకమైన పంటలు కాకుండా.. నూతన, లాభదాయకమైన పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించనున్నారు. వ్యవసాయ అధికారుల ద్వారా పంటల సాగులో ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం వంటి వాటిపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.
సీఎం బుధవారం ఉదయం ఉండవల్లిలోని నివాసం నుంచి హెలి కాప్టర్‌లో బయలుదేరి నల్లజర్లలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో బయలుదేరి 11.30గంటలకు నల్లజర్లలో వ్యవసాయ భూమి పరిశీలనకు వెళ్తారు. 11.30 నుంచి 11.50 వరకూ స్టా ల్స్‌ను సందర్శిస్తారు. కలెక్టర్ స్వాగత ప్రసంగం చేస్తారు. సీఎం 12.55 గంటల వరకు సుమారు 1000 మంది రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. వేదికపై ఏర్పాటు చేసిన మంచంపై కూర్చుని రైతులు, వారి కుటుంబాలతో కూడా మాట్లాడతారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడ తారు. తర్వాత మధ్యాహ్నం 1.45 నుంచి 3.15 గంటల వరకూ గోపాలపురం నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 3.30 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 3.40 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి ఉండవల్లి వెళ్తారు. సీఎం పర్యటనపై కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ పెద్దసంఖ్యలో రైతులు పాల్గొంటున్న నేపథ్యంలో పకడ్బందీ గా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజావేదిక వద్ద ఐదు స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. సభలో రైతులు, వ్యవసాయం, హార్టీకల్చర్, మత్స్యశాఖ అధికారులు పాల్గొంటారని తెలిపారు.
బందోబస్తు ఏర్పాట్లను ఏలూరు రేంజ్ ఐజీ జీవీకే అశోక్‌కుమార్, ఎస్పీ డి.నరసింహ కిశోర్ పరిశీలించారు. 1200మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పర్యటన సజావుగా సాగేలా సభావేదిక, హెలిప్యాడ్ తదితర ప్రాంతాల్లో ముందస్తు ఏర్పాట్లు, భద్రత చర్యల గురించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్, ఎమ్మెల్యే మద్ది పాటి వెంకట్రాజు, స్థానిక అధికారులు సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos