ఆటో డ్రైవర్ సేవలో... పథకాన్ని  ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలు

అమరావతి : కూటమి ప్రభుత్వం సంక్షేమం దిశగా మరో అడుగు వేసింది. ఇప్పటికే పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం....ఈ క్రమంలో డ్రైవర్ల సంక్షేమం కోసం ‘ఆటో డ్రైవర్ సేవలో...’ పథకానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకం  రూపొందించింది. ఈ పథకం కింద అర్హులైన డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఇవ్వనున్నారు. ఈ పథకాన్ని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరుకానున్నారు.

2.90 లక్షల మందికి రూ.436 కోట్ల లబ్ది

సొంత ఆటో, క్యాబ్ కలిగి వాటిపై ఆధారపడి జీవిస్తున్న వారి కోసం రూపొందించిన ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.436 కోట్లను కేటాయించింది. ఈ నిధులను నేరుగా డ్రైవర్ల ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు కేవలం ఏడాదికి రూ.10 వేలు మాత్రమే ఇచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం గత పాలకులకంటే 50 శాతం అదనంగా రూ.15 వేలు ఇస్తోంది. అలాగే గత ప్రభుత్వం ఈ పథకానికి కేవలం 2,61,516 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించి రూ.261.51 కోట్లే ఖర్చు పెట్టింది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కూటమి సర్కారులో లబ్ధిదారులు సుమారు 30 వేల మంది పెరిగారు.. అలాగే డ్రైవర్లకు రూ.175 కోట్లు అదనంగా లబ్ధి చేకూరుతోంది. కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంలో ఆటో డ్రైవర్లు 2,25,621 మంది, త్రీ వీలర్ ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లు 38,576 మంది, మోటార్ క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సి క్యాబ్ డ్రైవర్లు 6,400 మంది ఉన్నారు. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 22,955 మంది డ్రైవర్లకు లబ్ధి కలగనుంది.

హామీ ఇవ్వకున్నా డ్రైవర్లకు లబ్ది

వాస్తవంగా చూస్తే ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలు అనే కార్యక్రమం పార్టీ మేనిఫెస్టోలో చెప్పలేదు. అయితే స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం అమలు నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు సాయం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తోంది. ఏ ఒక్క లబ్ధిదారు నష్టపోకూడదని సిఎం స్పష్టం చేయడంతో గతానికంటే ఆర్థిక సాయం పెరగడంతో పాటు.. లబ్ధిదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం వచ్చాక వాహనదారులకు మేలు కలిగించేలా పనులు చేపట్టింది. గత ప్రభుత్వంలో ఉన్న రోడ్ల దుస్థితి కారణంగా  ఆటో డ్రైవర్లు, వాహనదారులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. గుంతల రోడ్ల కారణంగా ఆటోలు, ఇతర వాహనాలు దారుణంగా దెబ్బతినేవి. వీటి రిపేర్ల ఖర్చు తడిసిమోపెడు అయ్యేది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ సమస్య నుంచి గట్టెక్కించింది. రూ.1,000కోట్లు ఖర్చు చేసి రోడ్ల మరమ్మతులు చేపట్టి సాఫీగా ప్రయాణం సాగేలా చేసింది. అంతేకాకుండా పాతవాహనాలపై గత ప్రభుత్వం భారీగా వేసిన గ్రీన్ ట్యాక్స్‌ను కుదించింది. నాడు రూ.20 వేలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ ను రూ.3 వేలకు తగ్గించి వాహనదారులకు పెద్దమొత్తంలో ఉపశమనం కలిగించింది. దీంతో ఆటోలు, క్యాబ్ లపై పెద్ద ఎత్తున భారం తొలగింది.

ఫిర్యాదుల కోసం ప్రత్యేక వ్యవస్థ

అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకం అందేలా చేయాలని అధికారులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. అర్హత ఉండి కూడా జాబితాలో పేరు లేకుంటే... వారి సమస్యను పరిష్కరించిన వెంటనే లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు. దీని కోసం ప్రత్యేకంగా ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రభుత్వం ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది. వాట్సాప్ ద్వారా ఒక ప్రత్యేక గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ సిస్టమ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. లబ్ధిదారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌లో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos