ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రోడ్ల పరమ్మతులకు శ్రీకారం చుట్టారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెం గ్రామం పరవాడ జంక్షన్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఏర్పాటు కావాలని అన్నారు. గత ఐదేళ్లలో అప్పటి సీఎం జగన్  రాష్ట్రంలో ప్రమాదమైన గోతులు తవ్వారని .. నరకానికి కేరాఫ్ అడ్రస్ గా రాష్ట్ర రోడ్లను మార్చారని దుయ్యబట్టారు. గత ఐదేళ్ళలో రోడ్ల మరమ్మతులకు  వెయ్యి కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడంటే ... ఇది జగన్ అరాచక పాలనకు పరాకాష్ట అని చేయబట్టారు. అప్పట్లో రోడ్ల మీద డెలివరీలు అయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని అన్నారు. రోడ్లు బాగుంటే పరిశ్రమలు వస్తాయి.. ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, రోడ్లు బాగుంటే రైతు పండించే పంటకు గిట్టుబాటు వస్తుందని, దళారులు దోచుకోకుండా వ్యాపారాలు బాగుంటాయని అన్నారు.  జనవరి కల్లా రోడ్లు గుంతలు పూడ్చి వేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు సీఎం చంద్రబాబు.

రౌడీ రాజకీయాలు వద్దు అభివృద్ధి కావాలని.. బురద లేని రోడ్లు వేసే బాధ్యత మాది, మళ్ళీ జగన్ అనే రాక్షసుడిని రానివ్వకుండా చేసే బాధ్యత మీది అని చంద్రబాబు అన్నారు. జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేసేసాడని.. గత పాలకుల చేష్టలకు సమర్థవంతమైన అధికారులు నిర్వీర్యం అయిపోయారని.. గాడి తప్పిన అన్ని వ్యవస్థలను మళ్ళీ తిరిగి గాడిలో పెట్టడమే మా లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఐదేళ్లలో అన్ని రోడ్లు ఎలా అభివృద్ధి చేయాలో స్పష్టమైన అవగాహనతో మీ ముందుకు వస్తామని.. 76 వేల కోట్ల రూపాయలతో నేషనల్ హై వే పనులు అవుతున్నాయని... రెండున్నరేళ్లలోనే పూర్తి చేయాలని ఆదేశించామని చంద్రబాబు అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ... ప్రజలు గెలవాలంటే ఎన్డీయే ను గెలిపించాలని అడిగానని ... దీంతో ప్రజలు 90% మెజారిటీతో గెలిపించారని అన్నారు.

రాష్ట్రానికి ఎప్పుడు అయితే పన్నులు వస్తాయో .. అప్పుడు అభివృద్ధికి ఖర్చు పెట్టడానికి తోడ్పడతాయని అన్నారు. వ్యక్తిగత ఆదాయం పెరిగినప్పుడే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని... వాటి నుంచి సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలన్నారు. రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. దీని కోసం మౌలిక సదుపాయాలు అవసరమని అన్నారు. అందుకే రాష్ట్రంలో రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చేందుకు 860 కోట్లు ఖర్చు పెడుతున్నామని చంద్రబాబు తెలిపారు. మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మతు పనులకు చంద్రబాబు శ్రీకారం చుట్టడంపై రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos