ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు విషయంలో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఐవీఆర్‌ఎస్‌తో పాటు వివిధ రూపాల్లో లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ సిబ్బంది, ఉద్యోగులు, అధికారులపై వచ్చిన ఫీడ్ బ్యాక్‌పై అధికారులు చంద్రబాబుకు నివేదిక అందించారు. 

పింఛన్ల పంపిణీ, దీపం పథకం అమలు, అన్న క్యాంటీన్ నిర్వహణ, ఇసుక సరఫరా వంటి పథకాలు, పాలసీలపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంపైనా చంద్రబాబు ఆరా తీశారు. ప్రభుత్వానికి సంబంధించిన ఏడు శాఖల్లో పథకాలు, కార్యక్రమాలపై సేకరించిన సర్వే ఫలితాలపై అధికారులు ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. వివిధ మార్గాల్లో సేకరించిన వివరాల ఆధారంగా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయగా.. ప్రజల సంతృప్తి అంశంలో క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితుల ఆధారంగా ముందుకెళ్లాలని సీఎం ఆదేశించారు.

 ప్రజలే ఫస్ట్ అనే విధానంలో ప్రజల అభిప్రాయాలు, అంచనాల మేరకు పనిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల సంతృప్తి అంశంలో క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితుల ఆధారంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చంద్రబాబు తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos