రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి కొత్త దిశానిర్దేశం చేసేలా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) స్వరూపాన్ని పూర్తిగా మార్చి, వాటిని రైతులకు సమస్త సేవలు అందించే కీలక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు సచివాలయంలో వ్యవసాయ శాఖ పనితీరుపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడిన రైతులకు ప్రభుత్వ సేవలు అందించడంలో ఆర్ఎస్కేలే ప్రధాన పాత్ర పోషించాలని స్పష్టం చేశారు. రైతులు ప్రతి చిన్న అవసరానికి వేర్వేరు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని, అన్ని సేవలు ఒకేచోట లభించేలా ఆర్ఎస్కేలను పునర్‌వ్యవస్థీకరించాలని సూచించారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు భూసారాన్ని పరిరక్షించడం అత్యంత ముఖ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. భూమికి అవసరమైన పోషకాలను అందించి, సారాన్ని పెంచడం ద్వారానే అధిక దిగుబడులు సాధ్యమవుతాయని తెలిపారు. భూసారంలో ఉన్న లోపాలను శాస్త్రీయంగా గుర్తించి, వాటిని సరిదిద్దేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రాబోయే రోజుల్లో సేంద్రియ, ప్రకృతి సేద్యానికి పెద్దపీట వేయాలని సీఎం స్పష్టం చేశారు. 2026 ఖరీఫ్ సీజన్ నాటికి రైతులు పెద్ద ఎత్తున సేంద్రియ సాగు చేపట్టేలా ప్రోత్సహించాలని లక్ష్యంగా నిర్దేశించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడం వల్ల పర్యావరణానికి, రైతు ఆరోగ్యానికి, ఆర్థికంగా కలిగే ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో వివరించి వారిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న ఏ మార్పు అయినా క్షేత్రస్థాయి సిబ్బందికి ముందుగా పూర్తిస్థాయిలో తెలిసి ఉండాలని, అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos