కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో యురేనియం లభ్యత కోసం శోధించడానికి  చేపట్టిన తవ్వకాలను ఆపేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఇక మీదట ఈ అంశంపై ఎలాంటి ప్రక్రియ కొనసాగకూడదని  అధికారులకు ముఖ్యమంత్రి చెప్పినట్టు  కర్నూలు జిల్లా అధికారులు తెలిపారు. ప్రజలు ఎలాంటి  భయాందోళనలు చెందవద్దని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా స్పష్టత ఇచ్చారు.

కర్నూలు జిల్లా లోని కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ లో  అత్యంత నాణ్యత గల యురేనియం ఉన్నట్టు కేంద్రం కనుగొనడంతో  ఆ ప్రాంతంలో యురేనియం తవ్వకాల కోసం రంగం సిద్ధం చేసింది. కోరుట్ల మయ్యమల గా పేరు పొందిన  ఈ అడవిలోని 468. 25 హెక్టార్ల విస్తీర్ణంలో  యరేనియం ఉన్నట్టు గుర్తించారు. అయితే దీనిపై  స్థానిక గ్రామాల ప్రజలకు  అవగాహన కల్పించే ప్రయత్నం మాత్రం చేయలేదు. ప్రధానంగా 13 గ్రామాలు మొత్తం కలిపి 25 గ్రామాల వరకు  యురేనియం తవ్వకాల వల్ల  దెబ్బతింటాయనేది  ప్రాథమిక అంచనా.

అలాగే పర్యావరణం, నీరు, భూమి 50 కిలోమీటర్ల పరిధిలో కాలుష్యం బారిన పడతాయనేది  పర్యావరణ వేత్తల ఆందోళన. అకస్మాత్తుగా  వారం రోజుల క్రితం  యురేనియం భూమి అడుగున ఎంత లోతున ఉందో పరీక్షించడానికి 68 బోర్లను తవ్వే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ  కప్పట్రాళ్ల సహా  ఆయా గ్రామాల ప్రజలు రోడ్డుపైకి వచ్చి కర్నూలు - బళ్ళారి రహదారిని దిగ్బంధం చేశారు. పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తత కు లోను కావడంతో కొన్ని రోజులుగా  అక్కడ ప్రజలతో అధికారులు,అధికార పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారు. ప్రాణాలైనా ఇస్తాం కానీ  తమ ఊళ్లను వదిలి వెళ్ళేది లేదని కప్పట్రాళ్ల సహా  13 గ్రామాల ప్రజలు పోరాటం చేయడంతో  అక్కడ ఆ బోర్ల తవ్వకాలను నిలిపివేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

అయితే యురేనియం తవ్వకాలు అనేది  కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. కప్పట్రాళ్ల అడవిలోని యురేనియం చాలా శుద్ధమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల విద్యుత్, మెడికల్, డిఫెన్స్ రంగాల్లో  చాలా ప్రయోజనాలు ఉంటాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో  కేంద్రం  ఈ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను పూర్తిగా నిలిపివేస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos