ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. లైన్ తప్పితే కఠిన చర్యలు తప్పవని పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టం చేసారు. ఎమ్మెల్యేలు లిక్కర్ వ్యాపారాలకు దూరంగా ఉండాలని నిర్దేశించారు. ఇసుక వివాదాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసారు. వైసీపీ చేసిన తప్పులే వారిని 11 సీట్లకు పరిమితం చేసాయని వివరించారు. వారు చేసిన తప్పులే మనం చేయకూడదని నిర్దేశించారు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేసారు. ఇవాళ మంగళగిరి లోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మద్యం వ్యాపారాలకు దూరంగా ఉండాలని పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని... వైసీపీ హయాంలో చేసిన తప్పులే వారిని అధికారానికి దూరం చేసాయని చెప్పారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్లనే బడుమేరు పొంగి విజయవాడకు వరదలు వచ్చాయని చెప్పారు. వరద బాధితులకు సాయం కోసం కష్టపడ్డామని చెప్పుకొచ్చారు. ప్రత్యర్ది పార్టీల వద్ద సంచుల కొద్దీ డబ్బులు ఉన్నాయన్నారు. డబ్బులు ఉన్నా వారు గెలవలేకపోయారని వ్యాఖ్యానించారు.

2029లోనూ గెలుపు కోసం మిత్రపక్షాలతో సమన్వయం ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సారి ఏపీలో కరువుకు ఆస్కారం లేదన్నారు. కేంద్రం, ఏపీలో చేసే మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. పోలవరానికి కేంద్రం నిధులు ఇచ్చిందని చెప్పారు. కార్యకర్తలు కసితో ఉన్నారని..వారి కష్టంతోనే అధికారంలోకి వచ్చామని వివరించారు. ఎన్డీఏతో పొత్తులో ఉన్నా పదవులు డిమాండ్ చేయలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టమని చంద్రబాబు హెచ్చరించారు.

మనం కక్ష సాధింపు చర్యలకు దిగితే ప్రజలు... వైసీపీకి మనకి తేడా లేదనుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది సమీక్షించాలని సూచించారు. మిత్రపక్షాలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని.. ఎవరూ నిబంధనలు అతిక్రమించి వ్యవహరించవద్దని తేల్చి చెప్పారు. త్వరలో జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహంతో ముందుకు వెళ్లాలన్నారు. వివాదాలకు దూరంగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేసారు. మూడు పార్టీల మైత్రి భవిష్యత్ లోనూ కొనసాగాలని ఆకాంక్షించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos