శ్రీశైలానికి సీ ప్లేన్ సర్వీసులు శనివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. శుక్రవారం నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ అయింది. స్పైస్ జెట్ ఆధ్వర్యంలో విజయవాడ నుంచి శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లోకి సీ ప్లేన్ ను నడిపించేందుకు ఏపీ ప్రభుత్వం కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విజయవాడ పున్నమి ఘాట్ నుంచి తొలి సీ ప్లేన్ శనివారం ఉదయం సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
చంద్రబాబు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సీప్లేన్‌లో ప్రయాణం ప్రారంభించి... 12.45కు లోయర్ స్టేషన్ శ్రీశైలానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి దేవాలయాన్ని సందర్శిస్తారు. తిరిగి 2.20గంటలకు సీప్లేన్‌లో బయలు దేరి మధ్యాహ్నం 3.10గంటలకు పున్నమిఘాట్‌కు చేరుకుంటారు.
ప్రయాణానికి కేవలం 30 నిమిషాలు మాత్రమే సమయం పడుతుంది. ఇందులో టేకాఫ్, ల్యాండింగ్ కోసం 10 నిమిషాలు పోను, 20 నిమిషాలు గగనంలో విహరించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నదీ ప్రవాహం వెళ్లే ప్రదేశానికి అనుగుణంగా కాకుండా, పున్నమి ఘాట్ నుంచి నేరుగా శ్రీశైలం వెళ్లేలా రూట్‌ను అధికారులు ఎంపిక చేశారు. ప్లేన్‌లు గాల్లోకి లేవడం మొదలు నిర్దేశిత ప్రదేశం చేరుకున్న తర్వాత కిందికి దిగే ప్రక్రియ మొత్తం నీటిలోనే ఉండటం దీని ప్రత్యేకత. సాధారణంగా విమానాలకు మాదిరే ప్రత్యేకంగా రన్‌వే అవసరం లేదు. దీనికోసం నీటిలో తేలియాడే జెట్టీలను ఏర్పాటు చేయనున్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్‌లో ప్రత్యేక జెట్టీని అధికారులు ఏర్పాటు చేశారు. శ్రీశైలంలో ఇప్పటికే ఉన్న జెట్టీలను తాత్కాలికంగా వినియోగించుకోనున్నారు. జెట్టి నుంచి ర్యాంపు ద్వారా సీ ప్లేన్‌లోకి ఎక్కేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos