నారా భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణికి జన్మదిన శుభాకాంక్షలు కాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం 'X' (ట్విట్టర్) వేదికగా స్పెషల్ విషెస్ చెప్పారు. 'భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు' మీ ప్రేమ, బలం మా కుటుంబానికి ఆధారం. ప్రతి ఎత్తు పల్లంలోనూ నీవు నా పక్కనే ఉన్నావు. నా జీవిత భాగస్వామిగా నువ్వు ఉన్నందుకు నిజంగా నేను కృతజ్ఞుడను. నీవు మా జీవితాలకు వెలుగు. నీ దయ, ప్రజల పట్ల నీ సంరక్షణ, వ్యాపారం, ధానధర్మాలలో హృదయపూర్వక నాయకత్వం మమ్మల్ని అందరినీ అబ్బురపరుస్తుంది' అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము కు 'X' వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. 'భారతదేశ ప్రథమ పౌరురాలు, శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మంతులై, ఆరోగ్యవంతులై ఉండి, మీ జ్ఞానం, గౌరవంతో మన దేశాన్ని ప్రేరేపిస్తూ ఉండాలని కోరుకుంటున్నా' అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
మరోవైపు ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా తన మాతృమూర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా 'అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు' అంటూ పోస్ట్ చేశారు. 'అమ్మ ప్రేమ, దయ, మద్దతు తనకు పెద్ద బలం... నా మార్గదర్శి.. ప్రజలకు సేవలు చేయడం, వ్యాపార చతురత, న్యాయం కోసం పోరాడటం పట్ల ఆమె చూపే అంకితభావం స్ఫూర్తిదాయకం... ప్రతిరోజూ అమ్మను ఆరాధిస్తాను.. ప్రేమతో తమ జీవితాలను ప్రకాశవంతం చేసిన ఆమె ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని" కోరుకుంటూ నారా లోకేష్ పోస్ట్ చేశారు. లోకేష్‌తో పాటు ఆయన సతీమణి బ్రహ్మణీ, కుమారుడు దేవాన్ష్ కూడా భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos