లోక్ సభ జీవో అవర్ లో ఆంద్రప్రదేశ్ కు చెందిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మొదట సీఎం రమేష్ సభలో మాట్లాడుతూ వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం గురించి ప్రస్తావించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఏపీలో 10 రెట్ల పెద్ద స్కామ్ జరిగిందని, వైసీపీ హయాంలో మద్యం అమ్మకాలు కేవలం నగదు రూపంలోనే జరిగాయని గుర్తు చేశారు. ఒక్కటి కూడా డిజిటల్ లావాదేవీ లేదని, కొన్ని వేల కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు.
సీఎం రమేష్ ప్రసంగం కొనసాగిస్తున్న సమయంలోనే వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. సీఎం రమేష్ సీఎం రమేశ్ బీజేపీ కోసం పనిచేయడం లేదని, టీడీపీకి పనిచేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చే కాంట్రాక్టుల కోసం ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీలో జరిగిన అన్ని స్కాముల కన్నా మార్గదర్శి స్కామ్ చాలా పెద్ద కుంభకోణమని ఆరోపించారు.
కాగా ఏపీలో లిక్కర్ స్కాం అంశంపై విచారణ గతంలో సీఐడీ ఆధ్వర్యంలో సాగింది. పలుచోట్ల సోదాలు చేసి కీలక విషయాలు కనిపెట్టారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఆ దర్యాప్తు బృందంలో నగదు లావాదేవీలు నిర్వహించి.. ఎక్కడెక్కడికి తరలించారు.. అంతిమ లబ్దిదారు ఎవరో కూడా కనిపెట్టారని అంటున్నారు. ఈ క్రమంలో సీఎం రమేష్ పార్లమెంట్ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.
మరోవైపు మిథున్ రెడ్డి పై కూడా ఈ స్కాంలో ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయంలో ఆయన పార్లమెంట్ లో డిఫెండ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే స్కాం జరగలేదని చెప్పడానికి బదులు ఎప్పటిదో అయిన మార్గదర్శి అంశాన్ని ప్రస్తావించడం రాజకీయవర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. మొత్తంగా పార్లమెంట్ వేదికగా మరోసారి సీఎం రమేష్, మిథున్ రెడ్డి పరస్పర ఆరోపణలు చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos