ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు పర్యటనలో మార్పులు జరిగాయి. వాస్తవానికి ముఖ్యమంత్రి ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోసం బయల్దేరారు. అయితే చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను వెనక్కు తిప్పి గన్నవరం విమానాశ్రయంలో పైలట్ ల్యాండ్ చేశారు. వాతావరణం సరిగా లేకపోవడంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో హెలికాప్టర్ ల్యాండ్ చేశారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో కాకుండా గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం చేరుకున్నారు.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం మలకపల్లికి చేరుకుని ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఊరిలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ గ్రామానికి చెందిన చర్మకారుడు సనమండ్ర పోశిబాబు ఇంటికి వెళ్లారు. స్వయంగా చంద్రబాబు వెళ్లి పింఛన్ డబ్బుల్ని అందజేశారు. పోశిబాబుతో ముఖాముఖి మాట్లాడారు. అనంతరం బంగారు కుటుంబాల దత్తత కార్యక్రమంలో భాగంగా ప్రజావేదిక కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. మరోవైపు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'భారత మాజీ ఉప రాష్ట్రపతి, గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు. విద్యార్ధి నాయకుడిగా రాజకీయాలలో ప్రవేశించి దేశ అత్యున్నత స్థానానికి చేరిన అరుదైన వ్యక్తి ఆయన. శాసనసభ్యుడుగా, రాజ్యసభ సభ్యుడుగా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడుగా…. ఇలా ఏ స్థాయిలో పనిచేసినా ప్రజాసేవే పరమావధిగా శ్రీ వెంకయ్యనాయుడు భావించారు. అది ఆయన ప్రత్యేకత. ఆ విశిష్ట వ్యక్తిత్వమే ఆయనకు రాజకీయాలలో ప్రత్యేకతను సంతరించి పెట్టింది. శ్రీ వెంకయ్యనాయుడు గారు ఇలాంటి మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని, మరింతగా ప్రజాసేవ చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను' అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos