2025 నూతన సంవత్సరంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధిలోని నిధులను విడుదల చేసేందుకు చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ నుంచి 24 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు అంగీకరిస్తూ.. నూతన సంవత్సరంలో చంద్రబాబు తొలి సంతకం చేశారు. ఈ నిర్ణయం ద్వారా సుమారుగా 1600 మంది పేదలకు ఉపయోగం కలగనుంది. మరోవైపు ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత ఈ ఆరున్నర నెలల కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ కింద రూ.124 కోట్లు నిధులు విడుదల చేశారు. 9123 మందికి ఈ నిధులను అందించారు.

మరోవైపు నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం తర్వాత వేదమంత్రాలతో ఆశీర్వదించి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, అన్నింటా శుభం జరగాలని కోరుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న తెలుగువారితో పాటుగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అందరికీ చంద్రబాబు న్యూఇయర్ విషెస్ చెప్పారు. ఈ ఏడాది అనుకున్న పనులన్నీ నెరవేరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను నూతన సంవత్సరం మొదటి రోజున  దర్శించుకోవడం సంతోషంగా ఉందని చంద్రబాబు అన్నారు.

కనక దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం సీఎం  చంద్రబాబు రాజ్ భవన్ వెళ్లి గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గవర్నర్‌తో మర్యాదపూర్వక భేటీలో.. కొత్త ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాల గురించి గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌కు చంద్రబాబు వివరించినట్లు సమాచారం. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాల గురించి కూడా గవర్నర్ వద్ద వివరించినట్లు తెలిసింది. అనంతరం చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయానికి బయల్దేరి వెళ్లారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos