ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటనకు బయలుదేరారు. ఆదివారం రాత్రి ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. సీఎం వెంట మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, ఉన్నతాధికారుల బృందం ఉంది. ప్రపంచ ఆర్ధిక సదస్సు (WEF)లో ఈ బృందం పాల్గొననుంది.

జ్యూరిచ్ చేరుకున్న అనంతరం అక్కడ తొలుత స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్ కుమార్‌తో, అనంతరం ఎరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లా బృందంతో సమావేశమవుతారు. ఆ తర్వాత భారత ఎంబసీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. జ్యూరిచ్ కార్యక్రమాల అనంతరం సీఎం రోడ్డు మార్గంలో దావోస్ చేరుకుంటారు. పర్యటన తొలిరోజే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్ధిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌తో చంద్రబాబు భేటీ అవుతారు.

నేటి నుంచి 22 వరకు నాలుగు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో చంద్రబాబు మొత్తం 36 సమావేశాల్లో పాల్గొంటారు. గ్రీన్ ఎనర్జీ, ఐటీ, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి రంగాల్లో ఏపీకి ఉన్న అవకాశాలను ప్రపంచ వేదికపై వివరించి, పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. పర్యటన ముగించుకుని ఈ నెల 23న ఆయన హైదరాబాద్ చేరుకుంటారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos