ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీహార్ లో ముఖ్యమంత్రి మార్పు ఖాయమైంది. ప్రస్తుత సీఎం నితీశ్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసారు. బీజేపీ నేత కొత్త సీఎం గా బాధ్యతలు చేపట్టనున్నారు. మరో వైపు పలు రాష్ట్రాల గవర్నర్లను మార్పు చేసారు. కాగా, అయిదు రాష్ట్రాల ఎన్నికలకు బీజేపీ అధినాయకత్వం సమాయత్తం అవుతోంది. కేంద్రం - పార్టీ లో భారీ ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారుతోంది.

కేంద్రలోని బీజేపీ నాయకత్వం రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధాన భాగస్వామిగా ఉన్న నితీశ్ ను రాజ్యసభకు పంపుతోంది. ఆయన కుమారుడిని బీహార్ లో డిప్యూటీ సీఎం చేస్తూ ఆ రాష్ట్రంలో తమ పార్టీ నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయటానికి రంగం సిద్దమైంది. నితీశ్ ను రాజ్యసభ కు పరిమితం చేస్తారా.. కేంద్ర మంత్రి వర్గంలో అవకాశం కల్పిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో కీలక రాష్ట్రాల గవర్నర్లను మార్పు చేసారు. తమిళనాడు గవర్నర్ ను బెంగాల్ పంపారు. తెలంగాణ గవర్నర్ ను మార్చారు. త్వరలో అయిదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో కేంద్ర మంత్రివర్గంతో పాటుగా.. బీజేపీ జాతీయ నాయకత్వంలోనూ మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రులు గా ఉన్న పలువురికి పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు.

అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల నేతలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కనుంది. కాగా.. కేంద్ర మంత్రివర్గ విస్తరణ.. బీజేపీ అధినాయకత్వం నిర్ణయాలతో ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకుంటున్న కీలక పరిణామాల వేళ ఏపీ సీఎం చంద్రబాబు హస్తినకు వెళ్తున్నారు. రేపు శనివారం ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు ప్రగతి మైదాన్ , భారత్ మండపం లో జరిగే రైసినా డైలాగ్ - 2026 లో పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 వరకు పాల్గొననున్నారు. తిరిగి రాత్రి 7 గంటలకు అమరావతి చేరుకోనున్నారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ పైన చర్చ జరుగుతున్న వేళ.. ఏపీకి మరో బెర్తు దక్కనున్నట్లు సమాచారం. టీడీపీ, జనసేన నుంచి ఎవరికి ఈ అవకాశం దక్కనుందనేది సీఎం చంద్రబాబు - పవన్ డిసైడ్ చేయాల్సి ఉంది. సామాజిక సమీకరణాల ఆధారంగా కేంద్రంలో కొత్తగా మంత్రి ఎవరనేది నిర్ణయించనున్నారు. రెండో విడత పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన వెంటనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేయాలని బీజేపీ నాయకత్వం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos