పిల్లల భవిష్యత్తు, వారి మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధిస్తామని ప్రకటించారు. చిన్న వయసులోనే సామాజిక మాధ్యమాలకు అలవాటు పడటం వల్ల పిల్లల ప్రవర్తనలో ప్రతికూల మార్పులు వస్తున్నాయని, వారు దారి తప్పకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో చిన్న పిల్లల సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు.

ముఖ్యంగా 13 ఏళ్ల లోపు పిల్లలు సామాజిక మాధ్యమాలను వాడకుండా పూర్తిగా నిషేధించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే, 13 నుండి 16 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలు సోషల్ మీడియా వినియోగించడంపై ఎలాంటి ఆంక్షలు విధించాలనే అంశంపై కూడా ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సోషల్ మీడియా మితిమీరిన వాడకం వల్ల పిల్లలు చదువుకు దూరమవ్వడమే కాకుండా, అనవసరమైన విషయాల పట్ల ఆకర్షితులవుతున్నారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలోనే దీనిపై విధివిధానాలను రూపొందించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికే కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలు కూడా ఇదే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో, ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

త్వరలోనే సోషల్ మీడియా నిషేధంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, ఉత్తర్వులు జారీ చేయనుంది. దీనిపై తాము కసరత్తు చేస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా సభలో చంద్రబాబు వెల్లడించారు. పిల్లలు సరిగ్గా చదవడం లేదని, చెప్పిన మాట వినకుండా స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో ఫోన్ కొనివ్వకపోవడం, ఫోన్ లాగేసుకున్నారని పిల్లలు తీవ్ర నిర్ణయాలు తీసుకుని తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారనే వాదనలు ఉన్నాయి. ఈ సందర్భంలో చంద్రబాబు తీసుకోబోతున్న నిర్ణయంపై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos